అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుంటే నడిరోడ్డులో కనిపించిన సింహం.. చివరికి?

గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్( Somnath ) అనే ప్రదేశంలో ఒక భర్త, భార్య తమ బైక్‌పై రాత్రి వేళ వెళ్తుండగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది.ఈ ఘటన అక్టోబర్ 6వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నవాబందర్( Nawabandar ) అనే గ్రామంలో శ్రీరామాలయం దగ్గర జరిగిందని తెలుస్తోంది.

 In The Middle Of The Night While Riding A Bike, The Lion Was Seen On The Road In-TeluguStop.com

వారు బైక్‌పై గ్రామం గుండా వెళుతుండగా రోడ్డు మధ్యలో ఏదో ఒక జీవి నిలబడి ఉన్నట్లు కనిపించింది.అది వీధి కుక్క అనుకుని వారు ముందుకు వెళ్లారు.

కానీ, బైక్ దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ జీవి ఏమిటో స్పష్టంగా తెలిసింది.అది ఒక పెద్ద మగ సింహం.

అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో సింహాన్ని చూసి భర్త, భార్య ఎంతో భయపడిపోయారు.వెంటనే బైక్ కిందపడేసి, దాని పై నుంచి దిగి పరుగు పెట్టారు.దగ్గర్లో ఉన్న ఒక ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఈ సంఘటన మొత్తాన్ని రికార్డ్ చేసింది.ఆ సింహం కోపంగా ఉన్నట్లు కనిపించలేదు.దంపతులు పరుగు పెడుతుంటే ఆశ్చర్యంగా చూసింది.ఆ తర్వాత వారు పరుగు పెట్టిన దిశగా నెమ్మదిగా కదిలింది.

వారిని వెంబడించాలనే ఆసక్తి లేనట్లే అది కనిపించింది.

రోడ్డు మధ్యలో నిలబడి సింహాన్ని చూస్తున్న ఒక కుక్క కూడా దంపతులు పరుగు పెట్టిన వెంటనే అదే దిశగా పరుగు పెట్టింది. కుక్క ( Dog )ఎందుకు పరుగు పెట్టిందో తెలియదు.సింహం వల్లనా లేక దంపతులు పరుగు పెట్టినందువల్లనా అనేది తెలియ రాలేదు ఈ సింహం ఏదైనా మూగ జంతువు పై దాడి చేసి చంపిందా ఆ దంపతులకు ఏమైంది, అధికారులు దాన్ని పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలేశారా అనేది తెలియాల్సి ఉంది.

అడవులు విచక్షణారహితంగా నరికి వేయడం వల్ల అడవి జంతువులు ఆవాసాలు కోల్పోతున్నాయి.ఆహారం కూడా దొరక్క అవి ప్రజల నివాసాల్లోకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube