జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ( Junior NTR, Koratala Siva ) కాంబో మూవీ దేవర కలెక్షన్ల విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు సంబంధించి నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
నాగవంశీ మాట్లాడుతూ దేవర, ఇతర సినిమాల విడుదల హడావిడి పూర్తైన తర్వాత మా సినిమాను ప్రమోట్ చేయాలని అనుకున్నామని చెప్పారు.అందుకే ఇప్పటివరకు వేచి ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఈ నెల 30వ తేదీన లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ వేయాలని ఫీలవుతున్నామని నాగవంశీ( Naga Vamsi ) తెలిపారు.లక్కీ భాస్కర్ రిజల్ట్ విషయంలో పూర్తి కాన్ఫిడెన్స్ ఉందని అందుకే ప్రీమియర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేశామని ఆయన కామెంట్లు చేశారు.దేవర సినిమా హిట్టైంది కాబట్టి మిడ్ నైట్ షో ప్లస్ అయిందనే చెప్పాలని నాగవంశీ తెలిపారు.సినిమా బాగుంటే మాత్రమే ప్రేక్షకాదరణ పొందుతుందని గుంటూరు కారం విషయంలో సైతం అదే జరిగిందని నాగవంశీ కామెంట్లు చేశారు.
దేవర సినిమా( Devara movie )కు తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధిక గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు.మేము దేవర సినిమాకు సంబంధించి ఒరిజినల్ నంబర్స్ మాత్రమే తెలియజేశామని నాగవంశీ అన్నారు.దేవర మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను విదేశాల్లో ప్లాన్ చేశామని వార్తలు వస్తున్నాయని ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నాగవంశీ కామెంట్లు చేశారు.సినిమా కలెక్షన్ల పోస్టర్లు వేసేది ఫ్యాన్స్ కోసమేనని ఆయన పేర్కొన్నారు.
గ్రాస్ లో వచ్చేదానికి షేర్ లో వచ్చేదానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సైతం తెలుసని నాగవంశీ అన్నారు.దేవర కలెక్షన్లు నిజమేనని నాగవంశీ తెలిపారు.
బాలయ్య బాబీ మూవీ రిలీజ్ డేట్ ను దసరా కానుకగా ఇస్తున్నామని దీపావళి కానుకగా టైటిల్ టీజర్ ఉంటుందని నాగవంశీ పేర్కొన్నారు.