టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) దూకుడు పెంచారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే టిడిపి , జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటుతోంది.అయినా సూపర్ సిక్స్ పథకాల( Super Six Schemes ) అమలు విషయంలో ఆలస్యమైందని, ఇది మరికొంత ఆలస్యం అయితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయమూ చంద్రబాబులో కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు అన్ని హామీలను అమలు చేసి, ప్రజలలో తమకు తిరుగులేకుండా చేసుకుందామా అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.ఈ నేపథ్యంలోనే ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి గాడిన పడడంతో సూపర్ సిక్స్ హామీల అమలుపైన ప్రత్యేకంగా చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని( Free Gas Cylinders ) ప్రవేశపెట్టనున్నారు.ఆ తరువాత ఉచిత బస్సు ప్రయాణం పైన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు చంద్రబాబు వీటి అమలుపై ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
ప్రతినెల ఒకటో తేదీన పింఛన్లు , ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు ఇబ్బంది కలగకుండా ఇస్తున్నామని, అలాగే ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పైనే ప్రధానంగా దృష్టి సారించారు.
ఇప్పటికే విశాఖలో టిసిఎస్( TCS ) ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు రావడంతో దాదాపు పదివేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఏపీవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండడంతో , వారి ఉపాధికి ఇబ్బందులు ఏర్పడకుండా ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు.ఇక అమరావతి లోనూ( Amaravathi ) భవన నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టబోతుండడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు .అమరావతిలో భవన నిర్మాణ పనులు మొదలయితే ఎక్కువమంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని , అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుందని బాబు లెక్కలు వేసుకుంటున్నారు.ఇక యువతకు నెలవారి 3000 రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనూ సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నారు.
ఇప్పటికే దీని అమలుపై ఆర్థిక శాఖ అధికారులతోనూ చంద్రబాబు సమీక్ష నిర్వహించారట .నిరుద్యోగ భృతి అమల ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయాన్ని నివేదికల రూపంలో తనకు వెంటనే సమర్పించాలని ఆదేశించారట.వీటితో పాటు పేదరికం నిర్మాణం కోసం సంక్రాంతి పండుగ నుంచి బిఫోర్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.
ఇక విపక్షాలు టార్గెట్ చేసుకోకుండా వీలైనంత తొందరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తమకు తిరుగులేకుండా చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ తమకు ఇబ్బందికరంగా మారకుండా ముందుగానే చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.