అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.మరో నాలుగు వారాల్లో అమెరికాకు కొత్త అధ్యక్షుడెవరో తేలిపోనుంది.
రిపబ్లికన్ పార్టీ (republican party)నుంచి డొనాల్డ్ ట్రంప్(Donald Trump), డెమొక్రాటిక్(democratic party ) పార్టీ నుంచి కమలా హారిస్‌లు(kamala harris) అధ్యక్ష బరిలో నిలిచారు.ప్రచారం, నిధుల సేకరణలో ఇద్దరూ ఇద్దరే.
ట్రంప్‌కి వయసు రీత్యా ఇదే చివరి అవకాశం కావడంతో ఆయన తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.కమలా హారిస్ ఆయనకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు.
వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సర్వేలు, ఓపీనియన్ పోల్స్ వెలువడుతున్నాయి.ఈ నేపథ్యంలో కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో పరిస్ధితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి.
ఎవరు వెనుకంజలో ఉన్నారో చూస్తే .ఎమర్సన్ కాలేజ్ పోలింగ్/ ది హిల్ నిర్వహించిన సర్వేలో స్వింగ్ స్టేట్స్‌లో కమలా- ట్రంప్(Trump-kamala harris) మధ్య నెక్ టూ నెక్ పోటీ ఉన్నట్లుగా తేలింది.అరిజోనాలో హారిస్ (47 శాతం)పై డొనాల్డ్ ట్రంప్ (49 శాతం) ముందంజలో ఉన్నారు.జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా(Georgia, North Carolina, Pennsylvania) రాష్ట్రాలలో హారిస్ (48 శాతం), పై ట్రంప్ (49 శాతం) ఆధిక్యంలో ఉన్నారు.
బట్లర్‌లో ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ చేసిన ర్యాలీ, కమలా హారిస్ కోసం బరాక్ ఒబామాలు(Barack Obama) ప్రచారం చేయడంతో పెన్సిల్వేనియాలో ఇరు వర్గాలు బలంగానే ఉన్నట్లుగా సర్వే చెబుతోంది.అయితే మిచిగన్, విస్కాన్సిన్‌లలో మాత్రం ఇద్దరు అభ్యర్ధులు చెరో 49 శాతం ఓటింగ్‌తో సమానంగా ఉన్నారు.నెవాడాలో ట్రంప్ (47 శాతం)పై కమలా హారిస్ (48 శాతం) స్వల్ప ఆధిక్యంలో నిలిచారు.
ఎమర్సన్ కాలేజీ సర్వే ప్రకారం.ఆసియా సంతతి, యువ ఓటర్లలో కమలా హారిస్‌పై నమ్మకం పెరుగుతుందోట.కానీ పెద్దలు, స్వతంత్ర ఓటర్లు మాత్రం ఇంకా ఆమె వైపు మొగ్గు చూపాల్సి ఉంది.
వారంతా ట్రంప్ వైపే నిలబడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.అయితే మహిళా ఓటర్లు కమలా హారిస్ వైపు.
పురుషులు ట్రంప్ వైపు మొగ్గుచూపుతున్నారు.