తెలంగాణలో సమగ్ర కుల గణన( Telangana Caste Census ) చేపట్టే విషయమే తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.దీనిలో భాగంగానే తెలంగాణలో ఇంటింటికి కుటుంబ సర్వే చేపట్టాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ ,రాజకీయ కుల అంశాల పైన సమగ్రంగా సరే చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ) ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సర్వే బాధ్యతలను ప్రణాళిక శాఖకు అప్పగించారు.60 రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టారు.
అలాగే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పైన( SC Classification ) ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను నియమించింది.రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీం అత్తర్ ను కమిషన్ చైర్మన్ గా నియమించింది.ఉప కులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది.60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ కు ప్రభుత్వం సూచించింది.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కుటుంబ సర్వేను చేపట్టింది.అదే మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమగ్ర కుల గణన సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
దీంతోపాటు తెలంగాణలో ఇందిరమ్మ కమిటీ( Indiramma Committee ) ఏర్పాటు పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆ జీవోలో పేర్కొంది .గ్రామ స్థాయి సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీస్ , ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా ఉంటారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఇద్దరు ఎస్ హెచ్ జి గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలు సభ్యులుగా ఉంటారు.వీరు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు.లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.ఈరోజు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కమిటీల కోసం పేర్లు పంపించాలని సూచించింది.