రాజమౌళిని ముప్పు తిప్పలు పెట్టిన ఏకైక సినిమా.. ఏంటో తెలుసా..

ఎస్‌.ఎస్‌.రాజమౌళి( Rajamouli ) ‘స్టూడెంట్‌ నెం.1’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.23 ఏళ్ల కెరీర్‌లో 12 బంపర్ హిట్స్ అందుకున్నాడు.ఒక ఫ్లాప్ కూడా చవి చూడలేదు.

 One Only Irritated Movie For Rajamouli ,rajamouli , Eega , Kiccha Sudeep, Sur-TeluguStop.com

హాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడే స్థాయికి టాలీవుడ్‌ని తీసుకెళ్లాడు.రాజమౌళి మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి అతిపెద్ద సినిమాలను తీశాడు.

ఇలాంటి పెద్ద సినిమాలను పర్ఫెక్ట్‌గా తీయగల సత్తా ఇండియాలో ఎవరికీ లేదని చెప్పుకోవచ్చు.జక్కన్న ఇలాంటి భారీ సినిమాలను ఈజీగానే తీయగలిగాడు కానీ చిన్న సినిమా అయిన ‘ఈగ’ రూపొందించడంలో మాత్రం చాలా కష్టాలు పడ్డాడట.

నేడు (అక్టోబర్‌ 10) ఎస్‌.ఎస్‌.

రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ‘ఈగ’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసుకుందాం.

Telugu Eega, Kiccha Sudeep, Nani, Rajamouli, Sai Korrapati, Suresh Babu, Visual

రాజమౌళికి ‘ఈగ( Eega )’ టైటిల్ రోల్‌లో ఓ సినిమా తీయాలనే ఆలోచన డైరెక్టర్‌ అవ్వక ముందు నుంచే ఉందట. ఛత్రపతి సినిమా షూటింగ్‌ టైమ్‌లో అన్నీ భారీ బడ్జెట్‌ సినిమాలే చేస్తే బాగోదు, ఏదో ఒక చిన్న సినిమా చేయాలి అని జక్కన్న అనుకున్నాడు.అయితే ఇతర దర్శకుల వలె రొమాంటిక్, కామెడీ, హారర్‌ వంటి జానర్లు ఈ డైరెక్టర్‌కు అసలు నచ్చవు.

వాటిపై ఆయనకు అవగాహన కూడా లేదట.అందుకే వాటి జోలికి వెళ్లకుండా ఓ ఎక్స్‌పెరిమెంటల్‌ మూవీ చేద్దాం అనుకున్నాడు.

అలా ఆలోచిస్తున్న టైమ్‌లోనే ఆయనకు మరోసారి “ఈగ” కాన్సెప్ట్‌ జ్ఞాపకం వచ్చింది.అప్పుడు బలహీనుడు బలవంతుడిపై నెగ్గడం అనే ఓ పాయింట్‌ తీసుకొని ఈగ మూవీ డెవలప్ చేయడం మొదలుపెట్టాడు.

ఈగలాంటి చిన్న ప్రాణి మనిషిపై పగ తీర్చుకోవడం అంటే చాలామందికి క్యూరియాసిటీ కలుగుతుందని అనుకున్నాడు.

Telugu Eega, Kiccha Sudeep, Nani, Rajamouli, Sai Korrapati, Suresh Babu, Visual

జస్ట్ రూ.2.5 కోట్లలో ఈ సినిమాను రూపొందించి కొన్ని ప్రాంతాల్లోనే విడుదల చేద్దామని ప్లాన్ చేశాడు.కానీ ఆ లిమిటెడ్‌ బడ్జెట్‌లో ఆ సినిమా తీయడం అసలు కుదరలేదు.అప్పుడు నిర్మాత సురేష్‌బాబు ( Suresh Babu )‘బడ్జెట్‌ గురించి పట్టించుకోకుండా గురించి పట్టించుకోకుండా, కథ రెడీ చేయండి’ అని రాజమౌళికి చెప్పారు.

దాంతో జక్కన్న స్క్రిప్ట్‌ మొత్తం రెడీ చేశాడు.కట్ చేస్తే అది చాలా పెద్ద సినిమాగా మారిపోయింది.ఈగను విజువల్‌గా సినిమా మొత్తం చూపించాల్సిన మరో ఛాలెంజ్ కూడా రాజమౌళికి గుర్తొచ్చింది.ఆ టైమ్‌కి యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి జక్కన్నకు కొంచెం కూడా నాలెడ్జ్‌ లేదు.

దాంతో ఈగను క్రియేట్‌ చేసే బాధ్యత మకుట సంస్థకు ఇచ్చేశాడు.మరోవైపు మిగతా సినిమా కంప్లీట్ చేయడం మొదలు పెట్టాడు.

మకుట డెవలపర్లు 8 నెలలు కష్టపడి విజువల్ ఈగను క్రియేట్‌ చేశారు కానీ వాళ్లు క్రియేట్ చేసిన ఈగ అసలు ఈగలానే లేదట.ఈగ పార్ట్ పక్కన పెట్టి మిగతా షూటింగ్ మొత్తం అప్పటికే పూర్తి చేశారు.రూ.10 కోట్లు ఖర్చయ్యాయి.అప్పుడు మూవీని క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి రాజమౌళి బాగా ఆలోచించాడు.ఈగ క్లోజప్‌లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో స్పెషల్‌ లెన్స్‌ తెప్పించి ఈగను ఫోటోలు తీంచడం మొదలుపెట్టాడు.

ఈగ క్లోజప్‌లో భయంకరంగా, వికృతంగా కనిపించింది.అయితే ఆ ఫిజికల్ ఫీచర్స్ తొలగించి బాగున్నవి మాత్రమే ఉంచి ఈగను తయారు చేయాలంటూ జక్కన్న కోరాడు.

ఈసారి మకుట కంపెనీ చాలా చక్కగా ఈగను క్రియేట్ చేసింది.దాంతో రాజమౌళి సంతృప్తి పడి ఆ ఈగతోనే సినిమా పూర్తి చేశాడు.రూ.40 కోట్ల బడ్జెట్‌తో వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ‘ఈగ’ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు.తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 2012 జులై 6న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది, ఈ సినిమా హిందీ శాటిలైట్‌ రైట్స్‌ రూ.8 కోట్లకు అమ్ముడుపోయే ఆశ్చర్యపరిచాయి మొత్తం మీద ఈ మూవీ రాజమౌళి కెరీర్ లో ఒక బెస్ట్ సినిమాగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube