కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నటీమణులలో రెజీనా( Regina Cassandra) ఒకరు.తెలుగులో ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఒక సందర్భంలో వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అజిత్ హీరోగా తెరకెక్కుతున్న విడాముయర్చి సినిమా( Vidaamuyarchi )లో రెజీనా కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలను బోల్డ్ గా చెప్పే నటిగా కూడా రెజీనాకు పేరుంది.గతంలో కొన్ని వివాదాల ద్వారా కూడా రెజీనా వార్తల్లో నిలిచారు.తాజాగా అభిమానులతో ముచ్చటించిన రెజీనా చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజాగా ఒక నెటిజన్ రెజీనాను చెప్పకూడని పని ఏదైనా చేసి దొరికిపోయారా అని ప్రశ్నించడం జరిగింది.
ఆ ప్రశ్న గురించి రెజీనా బదులిస్తూ పక్కింట్లో ఏదో జరుగుతోందని అప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో చూద్దామని ఇంటిలోకి తొంగి చూస్తుండగా అమ్మ కంట్లో పడ్డానని చెప్పుకొచ్చారు.ఆ సమయంలో అమ్మ గట్టిగ చివాట్లు పెట్టారని రెజీనా పేర్కొన్నారు.ఇరుగుపొరుగు ఇళ్లలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చారు.
పెళ్లికి దూరంగా ఉన్న రెజీనా కెసాండ్రా రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించిన శుభవార్తను చెబుతారేమో చూడాల్సి ఉంది.రెజీనా తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కెరీర్ విషయంలో రెజీనా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.రెజీనా రెమ్యునరేషన్( Remuneration) ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
రెజీనా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రెజీనా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.