యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )సీడెడ్ కింగ్ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం.ఊసరవెల్లి( Usaravelli ) లాంటి ఫ్లాప్ సినిమాలతో సైతం సీడెడ్ లో దేవర డే1 డే2 రికార్డులను 13 ఏళ్ల క్రితమే తారక్ క్రియేట్ చేశారు.
సలార్, కల్కి అనంతపూర్ లో అదిరిపోయే కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేయగా దేవర ఆ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసింది.అనంతపూర్ లో దేవర 2.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించింది.
మరోవైపు దేవర మూవీకి ( Devara movie )ఈరోజు, రేపు బుకింగ్స్ మాత్రం బాగున్నాయి.
దేవర థర్డ్ వీకెండ్ కలెక్షన్లతో మంచి లాభాలను సొంతం చేసుకోవడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం వల్ల ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
నెగిటివ్ రివ్యూలను నమ్మాల్సిన అవసరం లేదంటూ ఈ సినిమాకు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
దేవర సినిమా ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించడం దేవర2 సినిమాకు( Devara 2 movie ) అన్ని విధాలుగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.ఆచార్య సినిమాతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ దేవర సినిమాతో నూటికి నూరు శాతం ఆ నెగిటివిటీని అధిగమించారనే చెప్పాలి.కొరటాల శివ కెరీర్ కు ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా నిర్మాతలకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలను అందించాయని తెలుస్తోంది.
దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల గురించి మండే పోస్టర్ తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.దేవర సినిమా సక్సెస్ ఎన్టీఆర్ లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో దేవర సినిమాపై తారక్ చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ఆ ఆశలను నిజం చేసిందనే చెప్పాలి.