2024 సంవత్సరంలో చిరంజీవి ( Chiranjeevi )నటించిన సినిమాలేవీ విడుదల కాలేదనే సంగతి తెలిసిందే.ఈ ఏడాది చిరంజీవి సినిమాలు రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్ ను సైతం బాధ పెట్టింది.
అయితే గేమ్ ఛేంజర్ కోసం విశ్వంభర సినిమాను( Vishwambhara movie ) వాయిదా వేయడం వల్ల విశ్వంభర మూవీ ప్రొడ్యూసర్లపై వడ్డీ భారం పెరగనుందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ మే 9వ తేదీ అని తెలుస్తోంది.
ఈ డేట్ గతంలో చిరంజీవి నటించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ డేట్ కావడం గమనార్హం.సెంటిమెంట్ డేట్ కావడం వల్లే ఆ తేదీన విశ్వంభర రిలీజ్ కానుందని తెలుస్తోంది.
చిరు సినిమాకే వాయిదా సమస్య ఎందుకంటూ ఫ్యాన్స్ ఒకింత బాధ పడుతున్నారు.విశ్వంభర వాయిదా వల్ల నిర్మాతలపై వడ్డీ భారం పెరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విశ్వంభర మూవీ వాయిదా పడటానికి ఓటీటీ స్లాట్ ( OTT slot )సమస్య కూడా ఒక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.200 కోట్ల రూపాయల ( 200 crore rupees )అత్యంత భారీ బడ్జెట్ తో విశ్వంభర మూవీ తెరకెక్కుతుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.విశ్వంభర సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకుడిగా పని చేస్తున్నారు.బింబిసార తర్వాత ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
విశ్వంభర సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుండగా ఈ సినిమాకు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ సైతం జరుగుతోంది.విశ్వంభర కమర్షియల్ హిట్ గా నిలిచి చిరంజీవి రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.విశ్వంభర మూవీ వాయిదా పడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విశ్వంభర మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.