తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఐడెంటిటీని సంపాదించుకున్న వాళ్ళలో విక్రమ్ ఒకరు.
ప్రస్తుతం విక్రమ్ తంగలాన్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా విక్రమ్ కి చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది.
కాబట్టి ఇక మీదట ఆయన చేయబోయే ప్రయోగాత్మకమైన సినిమాల విషయంలో ఆయన మరింత జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నాడు.
ఇక ఈ సక్సెస్ తో ఆయన మరిన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడానికి కూడా ఆస్కారమైతే లభిస్తుంది.కాబట్టి ఎలాగైనా సరే ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి మరొకసారి ఆయనకంటూ ఉన్న పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో విక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇంక దానికోసమే ఆయన తీవ్రమైన కసరత్తులు కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే శంకర్( Shankar ) డైరెక్షన్ లో ఆయన చేసిన అపరిచితుడు సినిమాని బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ ( Ranveer Singh )తో రీమేక్ చేయాలనే ప్రయత్నంలో శంకర్ ఉన్నాడు.
అయితే రీసెంట్ గా ఈ విషయం మీద కొంత మంది రిపోర్టర్లు ‘అపరిచితుడు ‘ సినిమాలో( Aparichithudu ) విక్రమ్ ని కాకుండా రన్వీర్ సింగ్ ను తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ కొంతమంది అడిగిన ప్రశ్నలకి విక్రమ్ సమాధానం చెబుతూ ఆ విషయం నాకు తెలియదు.శంకర్ గార్నే అడగాలి అంటూ సమాధానం అయితే చెప్పాడు.నిజానికి విక్రమ్ చేసిన అపరిచితుడు సినిమాలోని నటన ముందు ఆ పాత్రను వేరే ఏ నటుడు చేసినా కూడా తేలిపోతారనే చెప్పాలి.మరి అపరిచితుడు ప్రాజెక్టు అయితే ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది.
మరి ఫ్యూచర్ లో శంకర్ కి ఈ సినిమా చేసే ఆలోచన ఉందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…