రతన్ టాటా అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక అచ్చమైన భారత "రతన్‌"..!

రతన్ టాటా( Ratan Tata భారతదేశంలో పుట్టడం భారతీయుల అదృష్టం.ఆయనకు భారతరత్న ఇవ్వకపోయినా అచ్చమైన భారత రత్నం ఆయనే అనే ప్రజలు ఎప్పుడో గొప్ప పురస్కారం ఇచ్చేశారు.

 Untold Facts About Ratan Tata ,ratan Tata , Tata Group , Padma Vibhushan , S-TeluguStop.com

టాటా అంటే నాణ్యత, టాటా అంటే నమ్మకం, టాటా అంటే ఉపాధి, టాటా అంటే భారతీయం, టాటా అంటే విశ్వసనీయత ఇలా టాటాకి ఎన్నెన్నో మారు పేర్లు పెట్టుకున్నారు ప్రజలు.అంత గొప్పగా టాటా గ్రూపు( Tata Group )ను తీర్చిదిద్దిన వ్యక్తి రతన్ టాటా.

రతన్ టాటాకు పద్మవిభూషణ్‌( Padma Vibhushan) ఇచ్చారు తప్ప భారత రత్న ఇవ్వలేకపోవడం భారతదేశ వ్యవస్థ దుస్థితికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు.రతన్ కు ఏ పురస్కారాలు ఒక లెక్కల్లోకి రావు.

ఆయన అందరికీ మంచి చేయాలనే మనస్తత్వంతో బతికారు.ఆయనది అవార్డుల కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదు.

సంపన్న కుటుంబానికి చెందిన వారే కానీ చిన్నతనం నుంచి సామాన్యుడి గానే బతికారు.వారిది పార్శి కుటుంబం.

ఆయన పేరెంట్స్ ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే విడిపోయారు.దీని తర్వాత కొంతకాలం రతన్ ఓ అనాధాశ్రమంలో పెరిగారు.

Telugu Noel Tata, Padma Vibhushan, Ratan Tata, Tata-Inspirational Storys

అయితే రతన్ బామ్మ నవాజ్‌బాయి టాటా వెంటనే అతన్ని అక్కడి దత్తత తీసుకుని మరీ పెంచారు.పెద్దయ్యాక టాటా గ్రూపులో ఓ ఔట్‌సైడర్‌లా చిన్న పోస్టులో చేరారు.తన అద్భుతమైన తెలివి, డెడికేషన్ తో అంచెలంచెలుగా పెద్ద హోదాలకు ఎదిగి, ఆ గ్రూపును నడిపించే చైర్మన్ అయ్యారు.టాటా గ్రూప్ ను అనేక రంగాల్లోకి విస్తరించి పెద్ద మల్టీ నేషనల్ కంపెనీగా తీర్చిదిద్దారు.

లక్షల కోట్ల ఆదాయం సాధించిన ఆయన అందులో ఎక్కువ శాతం సామాజిక సేవకు డొనేట్ చేసేవారు.ఎన్నో కోట్లు దానాలు చేసే మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

Telugu Noel Tata, Padma Vibhushan, Ratan Tata, Tata-Inspirational Storys

సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు… గుండుసూది నుంచి విమానాల వరకు టాటా గ్రూప్ టచ్ చేయని ఫీల్డ్ లేదంటే అతిశయోక్తి కాదు.ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే టాటా అనే స్థాయిలో వారి వ్యాపారాలు విస్తరించాయి.ఇండియాలో బోలెడు మంది ఆదానీలు, అంబానీలు వ్యాపారరంగంలో రాణిస్తూ ఉండవచ్చు కానీ అసలైన భారత వ్యాపార రత్నం రతన్ ఒక్కరే.అందరి వ్యాపారస్తులకు ఆయన భిన్నం.ఇప్పుడు టాటా గ్రూపు సంస్థల మార్కెట్ వాల్యూ ( Tata Group )అక్షరాలా రూ.34 లక్షల కోట్లు.కొన్ని వేల కోట్ల వ్యాపారాన్ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన ఘనత రతన్‌కే దక్కుతుంది.రతన్ పెళ్లి చేసుకోలేదని చాలా మంది ఒక అసంతృప్తి వ్యక్తపరుస్తుంటారు.

అపారమైన ఆస్తులున్నా భార్య, పిల్లలతో ఒక ఫ్యామిలీని ఆయన ప్రారంభించలేకపోయారు.అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఆయన ప్రేమించారట.

కానీ పెళ్లి చేసుకోలేకపోయారు.తరువాత ఆమెను మర్చిపోలేదు.

అంతేకాదు ఎవరినీ పెళ్లి చేసుకోలేకపోయారు.పిల్లలు లేరు కాబట్టి టాటా గ్రూపు వారసులు ఎవరవుతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఆయన సవతి సోదరుడు నోయల్ నావెల్‌ వారసుడు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ఆయనకు ముగ్గురు పిల్లలు.వారి పేర్లు లియా, మాయా, నెవిల్లే.

వీరిలో ఎవరో ఒకరు వారసులయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.వీళ్ళు ఆల్రెడీ టాటా గ్రూప్ సంస్థలలోనే పనిచేస్తున్నారు.

టాటా వీలునామాలో ఏముందో చూసి టాటా గ్రూపు బాధ్యతలు అప్పజెప్పవచ్చు.బిజినెస్ సర్కిళ్లలో మాయ టాటా పేరు బాగా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube