సాయి పల్లవి( Sai Pallavi ) మంచి నటి మాత్రమే కాదు చాలా టాలెంటెడ్ డాన్సర్ కూడా.ఈ ముద్దుగుమ్మ కడుపులో ఉన్నప్పుడు తన తల్లికి డ్యాన్స్ చేయాలని అనిపించిందట.
అందుకే మ్యూజిక్ వింటూ ఆమె డాన్స్ చేసిందట.ఈ విషయాన్ని సాయి పల్లవి ఇంటర్వ్యూలో తెలిపింది.
తాను గత జన్మలో మంచి డాన్సర్ అయ్యుంటానని, అందుకే తన తల్లికి డ్యాన్స్ చేయాలనే ఫీలింగ్ కలిగి ఉండొచ్చని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అద్భుతంగా నాట్యం చేయగల సామర్థ్యాన్ని తనకు దేవుడు ఒక వరం లాగా అందించాడని ఆమె పేర్కొంది.
సాయి పల్లవి ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలలోని పాటల్లో తన అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించింది.

ముఖ్యంగా ఆమె రౌడీ బేబీ సాంగ్ లో తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఇండియాని షేక్ చేసింది.“రౌడీ బేబీ” పాట( Rowdy Baby ) 2018లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం మారి 2లోనిది.యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ తమిళ పాటను ధనుష్ పాడాడు.దీనికి యూట్యూబ్‌లో 150 కోట్లు వ్యూస్ వచ్చాయి.అంటే ఏ లెవెల్ లో ఈ పాట హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.దీని గురించి కూడా సాయి పల్లవి ఇంటర్వ్యూలో మాట్లాడింది.ఈ పాట హిట్ అయ్యాక ధనుష్ తనను కంగ్రాచ్యులేట్ చేశాడని, నాకు చాలా మంచి క్రెడిట్ వస్తుందని, దానంతటికీ తాను అర్హురాలిన అని అతడు చెప్పినట్లు తెలిపింది.

అంతేకాదు ధనుష్( Dhanush ) తో డాన్స్ చేయడం కొద్దిగా కష్టం అని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ధనుష్ చాలా ఫాస్ట్ గా డాన్స్ చేస్తాడు.మిగతా హీరోలతో పోలిస్తే చాలా ఎనర్జిటిక్ గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు.అతడితో మ్యాచ్ అయ్యేలాగా డాన్స్ చేయడానికి సాయి పల్లవికి కొద్దిగా కష్టంగా అనిపించిందట.అయితే చిన్నప్పుడు డాన్స్ చేసేటప్పుడు తన తండ్రి అమ్మాయిలకు అది పనికిరాదు అని చెప్పేవారట.ఊర్లో ప్రజలు కూడా “మీ అమ్మాయి ఏంటి అబ్బాయిలతో కలిసి డాన్స్ చేస్తోంది.
రేపొద్దున మన ఊర్లో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అని ప్రశ్నించే వారట.కానీ ఆమె తల్లి మాత్రం “డాన్స్ చేయడంలో తప్పేం లేదు.
నేను నా బిడ్డ పక్కనే ఉండి డాన్స్ చేపిస్తున్నా.ఆమె ఎలాంటి తప్పులు చేయడం లేదు” అని నచ్చ చెప్పేదట.
తన తల్లి కారణంగానే తాను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా డాన్స్ ని వదులుకోలేదని ఆమె తెలిపింది.శ్యామ్ సింగరాయ లో కూడా సాయి పల్లవి ట్రెడిషనల్ డ్యాన్స్ బాగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.