టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఈ పాన్ ఇండియా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది.కొరటాల ( Koratala Siva ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేసాయి.ఈ సినిమా ఈనెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఈసారి హిందీ ప్రమోషన్స్ లో కూడా తారక్ కొరటాల అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే హిందీ ప్రమోషన్స్ కి ఎవరెవరు సహకరిస్తున్నారు? అంటే దర్శక నిర్మాత కరణ్ జోహార్ సహా సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కూడా సహాయపడుతున్నారట.
అలాగే ఎన్టీఆర్ కోస్టార్ ఆలియాభట్( Alia Bhatt ) కూడా దేవర ప్రమోషన్స్ కోసం బరిలో దిగుతోందని ప్రచారం సాగుతోంది.ఈ సినిమాలో నటించిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ప్రచారం కూడా అక్కడ అదనపు బూస్ట్ ని ఇవ్వనుంది.ప్రస్తుతం సందీప్ వంగా ముంబైలో ఉన్నారు.
అక్కడ తారక్ బృందానికి ప్రమోషన్స్ పరంగా సాయపడనున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే వార్ 2లో ఎన్టీఆర్ కొలీగ్ అయిన హృతిక్ రోషన్( Hrithik Roshan ) కూడా దేవర-1కి ప్రచార సాయం చేస్తారని అంతా భావిస్తున్నారు.
తారక్ నోరు విప్పి అడిగితే హృతిక్ కాదని అనడు.ఒకవేళ గ్రీక్ గాడ్ ప్రచారం చేస్తే అది హిందీ బెల్ట్ లో వసూళ్లకు అదనపు బూస్ట్ ని ఇస్తుందని భావిస్తున్నారు.