పంపరపనస( Pamparapanasa ).సిట్రస్ పండ్లలో ( citrus fruits )ఇదీ ఒకటి.
పంపరపనసను ఇంగ్లీష్‌లో గ్రేప్‌ఫ్రూట్ అని పిలుస్తారు.చూడటానికి ఇది పెద్ద సైజు బత్తాయి పండు మాదిరి ఉంటుంది.
పులుపు, వగరు, తీపు రుచులను కలగలిసి ఉండే పంపరపనసను చాలా మంది పెద్దగా పట్టించుకోరు.పంపరపనసను తీసి పారేస్తుంటారు.
కానీ పంపరపనస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండులో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ నిండి ఉంటాయి.
పంపరపనస ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని రోజు తినడానికి ఇష్టపడతారు.
పంపరపనసలో విటమిన్ సి ( Vitamin C )మంచి మొత్తంలో ఉన్నందున.
ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.వ్యాధుల నుండి రక్షిస్తుంది.
ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు అడ్డు కట్ట వేస్తుంది.అలాగే పంపరపనస వాటర్ తో నిండి ఉంటుంది.
ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా మీ శరీరం యొక్క సరైన పనితీరుకు మద్దతు ఇస్తుంది.

పంపరపనసలో పీచుపదార్థం ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ఇది మీ జీర్ణాశయానికి మేలు చేస్తుంది.శరీరంలో మంచి బ్యాక్టీరియా ను పెంచుతుంది.అలాగే పంపరపనసలో ఉండే ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ ఇన్సులిన్ ( Vitamin C, Vitamin A Insulin )నిరోధకతను నిర్వహించడానికి మరియు మధుమేహాన్ని నిరోధించడానికి చాలా అద్భుతంగా తోడ్పడతాయి.
వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అవును పంపరపనస మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది.ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటే, మీరు తక్కువ తింటారు.ఫలితంగా బరువు తగ్గుతారు.

పంపరపనస పండులో బీటా కెరోటిన్( Beta carotene ) పుష్కలంగా ఉంటుంది.ఇది మీ కళ్లకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.ఇక విటమిన్ సికి గొప్ప మూలమైన పంపరపనస మీ చర్మాన్ని సూర్యరశ్మి, వడదెబ్బ, మంట మరియు వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది.స్కిన్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
కాబట్టి ఇకపై పంపరపనస కనిపిస్తే అస్సలు వదిలి పెట్టకండి.