బెల్లీ ఫ్యాట్ లేదా పొట్ట చుట్టు కొవ్వు.నేటి కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే సమస్య ఇది.పొట్ట చుట్టు కొవ్వు పెరిగిపోవడం వల్ల శరీర ఆకృతి అందహీనంగా మారడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయి.
అందుకే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరు పొట్ట తగ్గించుకునేందుకు తిండి మానేసి కడుపు మాడ్చుకుంటారు.
కానీ, తినడం మానేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.వాస్తవానికి కొన్ని కొన్ని ఆహారాలతోనూ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు.మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.వెల్లుల్లి మరియు తేనె కాంబినేషన్ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
అందువల్ల, ప్రతి రోజు మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను తేనె కలిపి తీసుకుంటే.పొట్ట వద్ద కొవ్వు సులువుగా కరుగుతుంది.
అలాగే కొవ్వును కరిగించడంలో క్యారెట్ కూడా సహాయపడుతుంది.

క్యారెట్‌లో కేలరీలు తక్కువగా.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఫైబర్ ఉన్న ఏ ఆహారం తీసుకున్నా బరువు తగ్గుతారన్న విషయం తెలిసిందే.
కాబట్టి, బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారు క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే పొట్టు చుట్టు కొవ్వును కరిగించడంలో ఓట్స్ కూడా సూపర్‌గా ఉపయోగపడతాయి.
ఓట్స్ ద్వారా శరీరానికి సరిపడా ప్రోటీన్లు అందడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
ఇక చాలా మంది కాకరకాయ చెదుగా ఉంటుందని ఇష్టపడరు.
కానీ, ప్రతి రోజు ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్ సేవిస్తే.త్వరగా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.అలాగే జీలకర్ర కూడా పొట్ట చుట్టు కొవ్వును కరిగిస్తుంది.అందువల్ల, ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్‌లో జీలకర్ర పొటి కలిపి తీసుకుంటే.క్రమంగా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.