తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas )… ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి క్రమంలో ఆయన సినిమాలు ఎందుకు ప్రేక్షకుల్ని అలరించడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో( Ala Vaikunthapuramlo ) ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆయన ‘గుంటూరు కారం’ సినిమాతో మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు.
కారణం ఏదైనా కూడా ఆయన సినిమా తీసే స్టాండర్డ్ అయితే తగ్గిపోతుంది అంటూ ప్రేక్షకుల్లో కొంతవరకు అసహనం అయితే వ్యక్తం అవుతుంది.రోటీన్ రొట్ట ఫార్ములా లోనే ఆయన సినిమాలు చేస్తున్నాడు తప్ప వైవిధ్యమైన కథాంశాలను మాత్రం ఎంచుకొని సినిమాలు చేయడంలో త్రివిక్రమ్ ఫేయిల్ అవుతున్నాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం.మరి ఇప్పటికైనా ఆయన రొటీన్ ఫార్ములా ను వదిలి భారీ సక్సెస్ ని సాధించడానికి ఒక భారీ ప్రాజెక్టుతో మన ముందుకు వస్తే మాత్రం తప్పకుండా ఆయన సక్సెస్ సాధిస్తాడని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే కొరటాల శివ( Koratala Shiva ) లాంటి దర్శకుడు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితం అవ్వాలని ఓన్లీ తెలుగులోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి ఆయన ఇలాంటి వైఖరిని ఎందుకు పాటిస్తున్నాడు అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.ఇక అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో ఎలాంటి స్పష్టత అయితే రావడం లేదు…చూడాలి మరి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు అనేది…
.