భార్యతో విడిపోయి షాకిచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో.. విడాకుల వెనుక కారణాలు ఇవే!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు విడాకులు( Celebrity Divorce ) తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తూ పలు సందర్భాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.తాజాగా అలాంటి సెలబ్రిటీల జాబితాలో జయం రవి సైతం చేరారు.

 Shocking Reasons Behind Jayam Ravi Divorce Details Inside Goes Viral , Celebrity-TeluguStop.com

జయం రవి తాజాగా సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.గత కొన్నిరోజులుగా జయం రవి( Jayam Ravi ) తన భార్య ఆర్తితో ( Aarti )విడాకులు తీసుకోనున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలే ఎట్టకేలకు నిజమయ్యాయి.

జయం రవి విడాకులకు సంబంధించిన పోస్ట్ లో లైఫ్ అనేది ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం అని ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.మీలో చాలామంది నన్ను ఆదరించి మద్దతుగా నిలిచారని అందుకే నేనెప్పుడూ నా అభిమానులతో, మీడియాతో, పారదర్శకంగా, నిజాయితీగా ఉంటానని చెప్పుకొచ్చారు.

నేడు మీ అందరితో ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నానని ఆయన అన్నారు.

Telugu Aarti, Jayam Ravi, Tollywood-Movie

ఈ విషయాన్ని భారమైన హృదయంతో చెప్పాల్సి వస్తోందని ఆయన కామెంట్లు చేశారు.ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన తెలిపారు.మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నామని అయన పేర్కొన్నారు.

మాతో పాటు మా కుటుంబ సభ్యుల ప్రైవసీని గౌరవించాలని నేను కోరుతున్నానని జయం రవి తెలిపారు.

Telugu Aarti, Jayam Ravi, Tollywood-Movie

2009 సంవత్సరంలో జయం రవి, ఆర్తి వివాహం జరగగా ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించడం ద్వారా తాజాగా జయం రవి ఖాతాలో మరో సక్సెస్ చేరింది.టాలీవుడ్ లో హిట్టైన జయం సినిమాను తమిళంలో రీమేక్ చేయడం ద్వారా ఈ నటుడికి మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా సక్సెస్ సాధించడంతో జయం రవికి వరుస ఆఫర్లు వచ్చాయి.ప్రస్తుతం జయం రవి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube