ఎన్టీఆర్ సందీప్ రెడ్డి కాంబోలో సినిమా రానుందా.. మీటింగ్ వెనుక కారణాలు ఇవేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఆ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga )డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

 Junior Ntr Sandeep Reddy Combo Movie Details Inside Goes Viral In Social Med-TeluguStop.com

ఈ డైరెక్టర్ చివరి సినిమా యానిమల్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

దేవర ట్రైలర్ లాంచ్ ( Devara trailer launch )కోసం ముంబై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగాను కలిశారు.స్లిమ్ లుక్ లో తారక్ అదుర్స్ అనిపిస్తుండగా ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా కాంబో సెట్ అయితే మాత్రం క్రియేట్ అయ్యే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవనే సంగతి తెలిసిందే.

Telugu Devaratrailer, Ntr, Ntrsandeep, Sandeep Reddy, Sandeepreddy, Tollywood-Mo

జూనియర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలలో అద్భుతంగా నటించే హీరో కాగా సందీప్ రెడ్డి వంగా మాస్ హీరోలను ఏ స్థాయిలో చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా కాంబో సినిమా గురించి ప్రకటన వస్తే మాత్రం ఒకింత సంచలనం అవుతుంది.ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Telugu Devaratrailer, Ntr, Ntrsandeep, Sandeep Reddy, Sandeepreddy, Tollywood-Mo

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూడాలి.తారక్ ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను ప్రకటించలేదు.వరుసగా క్రేజీ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్న తారక్ ఎంచుకునే డైరెక్టర్ల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తారక్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ తో సినిమా గుట్టు విప్పుతారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube