ఆస్ట్రేలియాలో మంత్రిగా కేరళవాసి .. నర్స్ నుంచి మినిస్టర్‌గా ..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆస్ట్రేలియాలోని( Australia ) నార్తర్న్ టెరిటరీ ఎన్నికలలో సిట్టింగ్ లేబర్ మంత్రిని ఓడించి సంచలనం సృష్టించిన కేరళకు చెందిన జిన్సన్ చార్ల్స్‌( Jinson Charls ) మంత్రిగా నియమితులయ్యారు.

 Indian Origin Jinson Charls Appointed Minister In Australia Details, Indian ,jin-TeluguStop.com

నార్తర్న్ టెరిటరీ ప్రభుత్వంలో వికలాంగులు, కళలు, వెటరన్స్, మల్టీకల్చరల్ ఎఫైర్స్‌కు మంత్రిగా ఆయన విధులు నిర్వర్తిస్తారని సోమవారం ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ (ఏబీసీ) నివేదించింది.

Telugu Australia, Australiajinson, Indian, Jinson Charls, Keralaborn, Khoda Pate

అతని నియామకం నార్తర్న్ టెరిటరీ పార్లమెంట్‌లో( Northern Territory Parliament ) ఓ చారిత్రాత్మక సందర్భం.కొత్త ప్రభుత్వం దక్షిణాసియా, ఆగ్నేయాసియా మూలాలున్న నేతలకు అత్యధిక ప్రాతినిధ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది.గత నెలలో ప్రాంతీయ అసెంబ్లీకి ఎన్నికైన ఇద్దరు భారత సంతతి నేతల్లో చార్ల్స్ కూడా ఒకరు.

గుజరాత్ సంతతికి చెందిన ఖోడా పటేల్( Khoda Patel ) మరొకరు.వీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కంట్రీ లిబరల్ పార్టీ (సీఎల్‌పీ) ఆగస్ట్ 24న జరిగిన ఎన్నికల్లో 25 సీట్లలో 17 సీట్లు గెలుచుకుని అధికారాన్ని అందుకుంది.

ఆస్ట్రేలియాలో రిజిస్టర్డ్ నర్స్‌గా, హెల్త్ లీడర్‌షిప్ హోదాల్లో పనిచేశారు చార్ల్స్.

Telugu Australia, Australiajinson, Indian, Jinson Charls, Keralaborn, Khoda Pate

చార్ల్స్, క్యాజురినా ఎమ్మెల్యే ఖోడా పటేల్ భారతదేశంలో జన్మించారు.ఫాంగ్ లిమ్ ఎమ్మెల్యే తంజిల్ రెహమాన్ బంగ్లాదేశ్‌, వంజరి ఎమ్మెల్యే అమీ కార్ల్‌సన్ ఇండోనేషియా మూలాలకు చెందినవారు.కేబినెట్ మంత్రిగా నియమితులైన అనంతరం చార్ల్స్ మీడియాతో మాట్లాడుతూ భారత్ నుంచి తనకు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయన్నారు.కేరళలో( Kerala ) జన్మించిన చార్ల్స్ .2011లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లేముందు నర్సింగ్, మిడ్‌వైఫరీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు.2015లో నార్తర్న్ టెరిటరీ రాజధాని డార్విన్‌కు వెళ్లిన చార్ల్స్ రిజిస్టర్డ్ నర్స్‌గా సేవలందించారు.కాగా.1977-83 మధ్యకాలంలో శాండర్సన్ నుంచి గెలుపొందిన లేబర్ సభ్యుడు జూన్ డి రోజారియా .నార్తర్న్ టెరిటరీలో గెలిచిన తొలి భారత సంతతి ఎమ్మెల్యే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube