మనలో చాలా మందికి జీవితంలో ఏదో సాధించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే కొందరికి ఆ ప్రయత్నాలు విఫలమై వారికి నచ్చి నచ్చక వచ్చిన ఉద్యోగాలతో సరిపెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు.
అయితే కొంతమంది వారి చిరకాల కోరికలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అచ్చం అలాంటి సంఘటన ఒకటి మలేషియాలో( Malaysia ) చోటుచేసుకుంది.70 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి మెడిసిన్ విద్యను పూర్తి చేసుకుని డాక్టర్ పట్టాను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
70 ఏళ్ళు వయసు గల వ్యక్తి మెడిసిన్( Medicine ) పూర్తి చేయడం ఏమిటి అని చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఆ వ్యక్తి పేరు ‘టో’.( Toh ) వాస్తవానికి అతడు తన జీవితంలో ఎప్పుడూ కూడా డాక్టర్( Doctor ) అవ్వాలని అనుకోలేదు.టెక్ సేల్స్ రంగంలో పనిచేసే రిటైర్డ్ అయిన అనంతరం ఒక సందర్భంలో కిర్గిస్థాన్ లో భారతీయ వైద్య విద్యార్థులు తారసపడ్డారు.
దీంతో అతనికి వైద్య విద్యను అభ్యసించాలని భావించి అనేక ప్రయత్నాలు చేశాడు.అంతేకాకుండా ఈ విషయం ముందుగా అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో తెలియచేసేగా ముందుగా ఇతనికి ఏమైంది అని వారందరూ కంగారు పడ్డారు.
ఇక టో వైద్య విద్య ప్రయాణం సులువుగా ఏమీ కొనసాగలేదు.మొదట ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమైన అనంతరం ఆసియాలోని పలు యూనివర్సిటీలకు అప్లై చేశాడు.
కానీ., వయసు కారణంతో అతడి దరఖాస్తులు తిరస్కరణకు కూడా గురయ్యాయి.2019లో ఫిలిప్పీన్స్ లోని సౌత్ వెస్టర్న్ యూనివర్సీటీ( South Western University ) అతనికి అడ్మిషన్ రాగా అక్కడికి వెళ్లి విద్యను అభ్యసించాడు.ఈ క్రమంలో మూడో సంవత్సరంలో ఆయన పీడియాట్రిక్ లో ఫెయిల్ అయ్యారు.
అయినా కానీ చివరి సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రిలో రెసిడెంట్ అండ్ డాక్టర్ గా పనిచేస్తూ.కొన్ని సందర్భాలలో 30 గంటల షిఫ్ట్ లలో కూడా అతను పనిచేశారు.
అలాంటి వయసులో ఇంత కష్టపడడం అవసరమా అంటూ కొందరికి అనిపించినా.కుటుంబ సభ్యులు తోటి విద్యార్థుల మద్దతుతో అతడు ముందుకు అడుగు వేశాడు.
ఒక పని తలపెట్టిన తర్వాత అది పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడం అవమానంగా అనిపించింది అంటూ దాంతోనే నేను పట్టుదలతో విద్యను అభ్యసన పూర్తి చేశాను అంటూ టో తెలియజేశారు.మొత్తానికి జూలై నెలలో అతను వైద్య విద్యను పూర్తి చేసుకొని డాక్టర్ పట్టాను సొంతం చేసుకున్నారు.