ఆ 40 నిమిషాలే దేవర సినిమాలో హైలెట్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) నటించిన దేవర సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం పక్కా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 Ntr Comments About Devara Highlight Sequence Details Inside Goes Viral ,junior-TeluguStop.com

చాలా సంవత్సరాల నుంచి తారక్ ను ఫుల్ లెన్త్ మాస్ రోల్ లో చూడాలని అభిమానులు భావిస్తుండగా ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.దేవర సినిమాతో తారక్ ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Devara Sequence, Devara Launch, Devara Trailer, Ntr, Ram Charan-Movie

దేవర మూవీ ట్రైలర్( Devara movie trailer ) లాంచ్ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్( Ram Charan ) తో కలిసి నటించానని ఆరు సంవత్సరాల తర్వాత నా సోలో మూవీ గా దేవర మూవీ విడుదల అవుతోందని కొంచెం టెన్షన్ గా ఉందని తారక్ తెలిపారు.దేవర మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. ముంబైలో దేవర మూవీ ట్రైలర్ విడుదల చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తారక్ పేర్కొన్నారు.గత సినిమా ప్రమోషన్స్ సమయంలో నార్త్ ఆడియన్స్ ఆదరణ చూసి ఆశ్చర్యపోయానని ఈ కొత్త సినిమాల సైతం నార్త్ ఆడియన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నానని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.

Telugu Devara Sequence, Devara Launch, Devara Trailer, Ntr, Ram Charan-Movie

దేవర మూవీ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని సినిమాలో చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయమని తారక్ తెలిపారు.సినిమా సినిమాకు కొరటాల శివ పై నా ప్రేమ గౌరవం పెరుగుతూనే ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేశారు.కొరటాల శివ( Koratala Shiva ) గారితో ఎంతోకాలంగా నాకు పరిచయం ఉందని నా బృందావనం సినిమాకు కొరటాల శివ రచయితగా పనిచేశారని తారక్ అన్నారు.సాధారణంగా కమర్షియల్ సినిమాలలో హీరో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతాడని దేవర సినిమాలో మాత్రం దానికి భిన్నంగా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.

దేవర సినిమాలో మనిషిని చంపే ధైర్యం ఉన్న కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడని తారక్ తెలిపారు.దేవర సినిమాకి సంబంధించి 38 రోజులపాటు అండర్ వాటర్ లో షూట్ జరిగిందని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా రాబోతుందని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube