తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వాళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఈయన మీద రోజుకోక వార్త అనేది వస్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేక్షకులందరిని అలరిస్తుందనే చెప్పాలి.
ఇక ఇప్పటికే ఈయన హీరోలందరితో సినిమాలను చేసి మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు.మరి ఇప్పుడు తను చేయబోయే సినిమా ఎవరితో ఉంటుంది అనేదాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక అప్పట్లో రామ్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాను అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు.కానీ అది కార్య రూపం దాల్చలేదు.

గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )తో భారీగా నష్టపోయిన తివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాను కూడా చేయబోతున్నాడు అంటూ పలు సందర్భాల్లో వార్తలైతే వచ్చాయి.కానీ వాటి మీద ఎలాంటి స్పష్టత అయితే రాలేదు.కాబట్టి ఇకమీదట సినిమా మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.ఒకప్పుడు మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన తన మ్యాజిక్ ను మాత్రమే రిపీట్ చేయడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు.ఇక బాలీవుడ్ హీరోలు కొంతమంది ఆయనతో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నప్పటికీ ఆయన మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్న రామ్ ను హీరోగా పెట్టి త్రివిక్రమ్ ఒక సినిమాను చేయడానికి ప్రణాళికలను రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది… మరి తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కూడా తనదైన రీతిలో భారీ సక్సెస్ కోసం చాలా వరకు ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
.