టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) కు ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో క్రేజీ ఉంది.అయితే ఈ మధ్యకాలంలో ఒక వివాదం వల్ల రాజ్ తరుణ్ పర్సనల్ కెరీర్ కు, సినీ కెరీర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజాగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.తనకు సంబంధించిన 12 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలించారని ఆమె నార్సంగి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra ) పై లావణ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.నా బంగారు గాజులు, తాళిబొట్టు, బ్రాస్లెట్, చైన్ మాల్వి దొంగలించిందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.మాల్వి మా ఇంటికి మూడుసార్లు వచ్చిందని నగలు దాచిన బీరువా తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయని ఆరోపణలు చేశారు.
ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని లావణ్య పోలీసులకు వెల్లడించారు.
అదే సమయంలో మాల్వి మల్హోత్రా గురించి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు.నా రాజ్ ను తిరిగి పంపించాలని నా మనిషిని తీసుకెళ్లి నన్ను ఒంటరిదాన్ని చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మాళ్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ను తన గ్రిప్ లో పెట్టుకుందని నేను తిరిగి వెళ్లే సమయంలో ఇంటి తాళాలు రాజ్ కు ఇచ్చానని లావణ్య చెబుతోంది.
పోలీసులు ఛార్జ్ షీట్ లో ఇప్పటికే రాజ్ తరుణ్ ను నిందితునిగా చేర్చారనే సంగతి తెలిసిందే.రాజ్ తరుణ్ లావణ్య మధ్య సహజీవనం నిజమేనని పోలీసుల విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే.
రాజ్ తరుణ్ త్వరలో భలే ఉన్నాడే ( Bhale Unnade )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.