గల్ఫ్‌లో ఇంటి పెద్ద మరణం.. మూడేళ్ల తర్వాత బాధిత కుటుంబానికి పరిహారం

మూడేళ్ల క్రితం ఒమన్‌( Oman )లో జరిగిన ప్రమాదంలో మరణించిన ఝంజోతి గ్రామానికి చెందిన సుఖ్‌దీప్ సింగ్ కుటుంబానికి పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కులదీప్ సింగ్ ధాలివాల్ బీమా పరిహారం అందజేశారు.రూ.31.34 లక్షల నష్టపరిహారాన్ని ఒమన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన అనంతరం ధాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.2021లో ఒమన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుఖ్‌దీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

 Oman Government Releases Rs 31.34l Financial Aid To Accident Victim’s Family I-TeluguStop.com
Telugu Balbirsingh, Jhanjoti Villag, Muscat, Oman, Punjab, Rs Financial, Sukhdee

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా తాము ఒమన్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ధాలివాల్( Kuldeep Dhailwal ) వెల్లడించారు.సుఖ్‌దీప్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.ఈ విషయమై ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు లేఖ రాస్తానని ధాలివాల్ చెప్పారు.

విదేశాల్లో పనిచేసే ప్రజల హక్కులను కాపాడేందుకు పంజాబ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు.ఎన్ఆర్ఐలకు సంబంధించిన పలు సమస్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించబడుతున్నాయని ధాలివాల్ చెప్పారు.

Telugu Balbirsingh, Jhanjoti Villag, Muscat, Oman, Punjab, Rs Financial, Sukhdee

ఇకపోతే.కొద్దిరోజుల క్రితం గల్ఫ్‌లో యజమాని చెరలో మగ్గిపోయిన ఓ పంజాబీ మహిళ స్థానిక ఎంపీ సాయంతో ఎట్టకేలకు స్వదేశం చేరుకుంది.నకోదర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయింది.

దీంతో ఆమెను రాజ్యసభ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్( Balbir Singh Seechewal ) ప్రత్యేకంగా చొరవ చూపి మస్కట్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.అక్కడ తనను శారీరకంగా, మానసికంగా హింసించారని ఆ మహిళ వాపోయింది.

మస్కట్‌లో ఉన్న నాలుగు నెలలు తాను నరకం చూశానని.యజమాని కొట్టేవారని, కొన్నిసార్లు భోజనం కూడా పెట్టేవారు కాదని కన్నీటి పర్యంతమైంది.

గతేడాది కూడా గల్ఫ్‌లో మగ్గిపోయిన ఐదుగురు మహిళలను ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ సీచెవాల్ స్వదేశానికి రప్పించారు.మస్కట్, ఒమన్‌లలో భారీ జీతాలు ఆశపెట్టి వీరు ఐదుగురిని ట్రావెల్ ఏజెంట్లు బుట్టలో వేసుకున్నారు.

తీరా అక్కడికి వెళ్లాక గానీ తాము మోసపోయినట్లు వీరు గ్రహించలేకపోయారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube