మగధీర, పోకిరి లాంటి సినిమాలను తీసి హిట్ కొడదాం అనుకున్నారు.. కానీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టోరీ తో సినిమా హిట్ అయింది అంటే చాలు అదే స్టోరీని పట్టుకొని కొత్త సినిమాలు చేసే హిట్ కొట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు.ఉదాహరణకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చిన తర్వాత సేమ్ అలాంటి థీమ్ తోనే చాలా పల్లెటూరి ఫ్యామిలీ డ్రామాలు వచ్చాయి.

 Tollywood Movies Inspired By Other Movies , Other Movies, Tollywood Movies , Act-TeluguStop.com

వాటిలో కొన్ని యావరేజ్ హిట్స్ గా నిలిచాయి.ఇలా ప్రేక్షకుల నాడిని పట్టుకొని సినిమా చేస్తే మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుందని దర్శకులు, హీరోలు సేమ్ సినిమాలు చేస్తుంటారు.

అయితే కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాలు ఎలాగోలా పాస్ అయిపోతాయేమో కానీ యాక్షన్, ఫాంటసీ సినిమాలతో హిట్ కొడతామంటే అది సాధ్యమయ్యే పని కాదు.స్టోరీలో బాగా దమ్ము ఉంటేనే హిట్ అవుతుంది.

మగధీర, పోకిరి వంటి సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి వీటిని చూసి ఇట్లాంటి సినిమాలే తీశారు కొందరు.అయితే ఆ మూవీలు ఫెయిల్ అయ్యాయి.అవి ఏవో తెలుసుకుందాం.

• పోకిరి – కంత్రి

( Pokiri – Kantri )

పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన పోకిరి (2006) మూవీ ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించాడు.ఇందులో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్, డైలాగ్స్, సౌండ్‌ట్రాక్, మ్యూజికల్ స్కోర్, ప్లాట్ ట్విస్ట్, యాక్షన్ సీక్వెన్సులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పవచ్చు.

అయితే దీన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ తాను కూడా ఇలాంటి ఒక సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొడదామని కోరుకున్నాడు.అందుకే ఒక యాక్షన్ మూవీ చేశాడు.

దాని పేరు కంత్రి (2008).దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.

ఈ మూవీలో కొత్తగా ఏమీ లేకపోవడంతో కథ చెత్తగా ఉండటంతో ప్రేక్షకులు దీన్ని రిజెక్ట్ చేశారు.

Telugu Fantasy, Pokiri Kantri, Tollywood-Movie

• మగధీర – బద్రీనాథ్ – శక్తి

( Magadheera – Badrinath – Shakti )

రొమాంటిక్ ఫాంటసీ యాక్షన్ ఫిలిం మగధీర రామ్ చరణ్ ( Ram Charan )కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు.ఇందులో ఓపెనింగ్ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు.ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా అద్భుతంగా ఉంటాయి.

పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే దీంతో అల్లు అరవింద్ బాగా ఆశయపడ్డాడు తన కుమారుడితో కూడా ఇలాంటి ఒక సినిమా తీయించి సూపర్ హిట్ కొట్టాలనుకున్నాడు ఆ మూవీ మరేదో కాదు బద్రీనాథ్.వివి వినాయక్ చేసిన ఈ సినిమా యావరేజ్ హిట్ అయింది కానీ మగధీర రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా నటించగలడు.అందుకే అతను మగధీర లాంటి సినిమా తాను తీయగలనని ధీమా వ్యక్తం చేశాడు.

మెహర్ రమేష్ వినిపించిన “శక్తి” కథ అతనికి అప్పట్లో బాగా నచ్చేసింది.అది కూడా ఒక మగధీరలాగా అనిపించింది.

అందుకే అందులో యాక్ట్ చేసి ఒక ఇండస్ట్రీ హిట్ కొడదామని ప్రయత్నించాడు.కానీ శక్తి మూవీ డిజాస్టర్ అయ్యింది.

Telugu Fantasy, Pokiri Kantri, Tollywood-Movie

• భారతీయుడు – ఒక్కమగాడు

( Bharateeyudu – okkamagadu )

భారతీయుడు మూవీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు.కమల్ హాసన్ ( Kamal Haasan )ఈ మూవీతో మంచి హిట్ కొట్టాడని తెలిసి బాలకృష్ణ అచ్చం అలాంటి సినిమానే తీశాడు.దాని పేరు ఒక్క మగాడు.ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube