టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శకులలో శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) శైలి ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఆనంద్, గోదావరి లాంటి సినిమాలు తీసి ప్రశంసలు అందుకున్న ఈ దర్శకుడు మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నా ఇప్పుడు మాత్రం ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో సత్తా చాటారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు ధనుష్, నాగార్జునలతో కుబేర సినిమా తెరకెక్కిస్తున్నారు.
కుబేర సినిమా( Kubera movie ) ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో కమర్షియల్ అంశాలకు శేఖర్ కమ్ముల పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల తన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ ( Rashmika )గా నటిస్తున్నారు.
రష్మికకు కొన్ని వారాల క్రితం యాక్సిడెంట్ కాగా ఆమె యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నారు.రష్మిక ఈ సినిమా షూట్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో తెలియాల్సి ఉంది.కుబేర సినిమా సక్సెస్ సాధించడం అటు నాగార్జునకు ఇటు ధనుష్ కు కీలకమనే సంగతి తెలిసిందే.కుబేర సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కుబేర సినిమా కోసం నాగార్జున ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.కుబేర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కుబేర సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదలైంది.కుబేర సినిమా ఎప్పుడు విడుదలైనా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాకు దర్శకుడు శేఖర్ కమ్ముల రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.