యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరోగా నటించిన దేవర సినిమా( Devara Movie ) కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తరువాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.అలాగే ఎన్టీఆర్ సినీ కెరియర్లో ఇప్పటివరకు ఏ సినిమాకి జరగని విధంగా దేవర సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది.ఇక ఈ సినిమాకు కేవలం 17 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ చిరంజీవి( Chiranjeevi ) రికార్డులనే బ్రేక్ చేశారని తెలుస్తుంది.

కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య( Acharya ) సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ సినిమా నార్త్ అమెరికాలో ఫుల్ రన్ ($985K)ను రిచ్ కాగా.రిలీజ్ కు 17 రోజులు ఉండగానే దేవర ఈ రికార్డును బ్రేక్ చేసింది.ఈ జోష్ ఇలానే ఉంటే.రిలీజ్ నాటికే దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటవచ్చని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇలా చిరంజీవి సినిమా రికార్డులను బద్దలు కొట్టడంతో ఈ సినిమాపై మరికొన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందనేది తెలియాల్సి ఉంది.