అందరూ చూస్తుండగానే మూడో అంతాస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళా..(వీడియో)

ఇండోర్‌లోని( Indore ) లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టౌన్‌ షిప్‌ లో ఒక మహిళ( Woman ) మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఆ మహిళ పేరు అంకూరి బాయి అని పోలీసులు పేర్కొన్నారు.

 After Dispute With Husband Woman Jumped From Third Floor Video Viral Details, So-TeluguStop.com

ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.ఇంటి మూడో అంతస్తు( Third Floor ) నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది మహిళా.

ఆ మహిళకు భర్తతో గొడవ జరిగినట్లు సమాచారం.ఆ మహిళ మూడో అంతస్తులో చాలా సేపు నిల్చుని ఉండగా.

, ఓ వ్యక్తి పట్టుకునేందుకు రావడంతో ఒక్కసారిగా కిందకు దూకింది.కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

అయితే, ఆ భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఈ కేసులో పోలీసులు( Police ) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంవై ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.భర్త, ఇతర కుటుంబ సభ్యుల వాంగ్మూలం తర్వాతే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడికానున్నాయి.మహిళ భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.వారిద్దరికీ ఆరేళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో ఇంటి సమీపంలో ఉన్నవారు వీడియోని తీసి దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అతి తక్కువ సమయంలో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.ఈ నేపథ్యంలో ఈ వీడియోని చూసిన నెటిజన్స్ భయభ్రాంతులకు లోనవుతున్నారు.చిన్న చిన్న కారణాలకు ఇలాంటి పెద్ద డెసిషన్స్ తీసుకోవడం అవసరమా అంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.

ఆమె ఏ రేంజ్ లో మనస్థాపన చెందిందో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.చూడాలి మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కేసు గురించి ఎలాంటి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube