అందరూ చూస్తుండగానే మూడో అంతాస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళా..(వీడియో)
TeluguStop.com
ఇండోర్‌లోని( Indore ) లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టౌన్ షిప్ లో ఒక మహిళ( Woman ) మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఆ మహిళ పేరు అంకూరి బాయి అని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.
ఇంటి మూడో అంతస్తు( Third Floor ) నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది మహిళా.
ఆ మహిళకు భర్తతో గొడవ జరిగినట్లు సమాచారం.ఆ మహిళ మూడో అంతస్తులో చాలా సేపు నిల్చుని ఉండగా.
, ఓ వ్యక్తి పట్టుకునేందుకు రావడంతో ఒక్కసారిగా కిందకు దూకింది.కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
"""/" /
అయితే, ఆ భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసులో పోలీసులు( Police ) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంవై ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
భర్త, ఇతర కుటుంబ సభ్యుల వాంగ్మూలం తర్వాతే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడికానున్నాయి.
మహిళ భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.వారిద్దరికీ ఆరేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. """/" /
ఘటన జరిగిన సమయంలో ఇంటి సమీపంలో ఉన్నవారు వీడియోని తీసి దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అతి తక్కువ సమయంలో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో ఈ వీడియోని చూసిన నెటిజన్స్ భయభ్రాంతులకు లోనవుతున్నారు.చిన్న చిన్న కారణాలకు ఇలాంటి పెద్ద డెసిషన్స్ తీసుకోవడం అవసరమా అంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.
ఆమె ఏ రేంజ్ లో మనస్థాపన చెందిందో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
చూడాలి మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కేసు గురించి ఎలాంటి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
జర్మనీ పార్లమెంట్ ఎన్నికల బరిలో భారత సంతతి నేత .. ఎవరీ సిద్ధార్ధ్ ముద్గల్?