అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతి నేత కమలా హారిస్( Kamala Harris ) ఖరారైన సంగతి తెలిసిందే.దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి ఎదురుదాడి తీవ్రతరమైంది.
స్వయంగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఆమె జాతీయత, విధానాలపై విరుచుకుపడుతున్నారు.కమలా హారిస్‌నే కాకుండా ఆమె భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌పైనా( Doug Emhoff ) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన మొదటి పెళ్లి సమయంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు డౌగ్ అంగీకరించినట్లుగా సీబీఎస్ న్యూస్ నివేదించింది.
కమలా హారిస్‌తో వివాహానికి ముందు తన పిల్లలు చదువుకుంటున్న పాఠశాల టీచర్‌తో ఎమ్‌హాఫ్‌కు సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.2009లో సదరు ఉపాధ్యాయురాలు గర్భం దాల్చినట్లుగా నివేదికలు రావడంతో ఈ బంధాన్ని ఆయన అంగీకరించారు, అయితే ఆమెకు బిడ్డ లేదని సమాచారం.ఆ సమయంలో ఎమ్‌హాఫ్ తన మొదటి భార్య కెర్‌స్టిన్‌ను ( Kerstin )వివాహం చేసుకోగా.
ఈ వివాహేతర సంబంధం బయటపడటంతో వీరిద్దరూ విడిపోయారు.అయితే ఎమ్‌హాఫ్‌తో సంబంధం ఉన్న సమయంలో సదరు టీచర్ అతని పిల్లలకు బోధించడం లేదని నివేదిక తెలిపింది.
సీబీఎస్ న్యూస్‌కు( CBS News ) అందించిన ఒక ప్రకటనలో ఎమ్‌హాఫ్ మాట్లాడుతూ.తన మొదటి వివాహం సమయంలో కెర్‌స్టిన్ , నా చర్యల కారణంగా కొన్ని కఠిన పరిస్ధితులను ఎదుర్కొన్నామన్నారు.ఇదే అంశంపై అతని మొదటి భార్య కెర్‌స్టిన్ మాట్లాడుతూ.డౌగ్, తాను ఏళ్ల క్రితం వివిధ కారణాల వల్ల వివాహ బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.అతను మా పిల్లలకు గొప్ప తండ్రి, తనకు నేటికీ గొప్ప స్నేహితుడిగా కొనసాగుతున్నాడని .దీనికి తాను గర్వపడుతున్నానని ఆమె వెల్లడించారు.
కోర్టు రికార్డుల ప్రకారం.కెర్‌స్టిన్, ఎమ్‌హాఫ్‌లు 2009లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, 2010 చివరిలో మంజూరైనట్లుగా సీబీఎస్ న్యూస్ నివేదించింది.వివాహానికి ముందే ఎమ్‌హాఫ్‌కు మరో మహిళతో ఎఫైర్ ఉందని కమలా హారిస్‌కు తెలుసు.2020లో వైస్ ప్రెసిడెంట్ వెట్టింగ్ ప్రక్రియను నిర్వహించిన సమయంలో బైడెన్ ప్రచార బృందానికి తెలుసునని నివేదిక తెలిపింది.