ఉత్తమ చిత్రం బలగం ఉత్తమ నటుడు నాని.. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విషయంలో సత్తా చాటిన సినిమాలివే!

తాజాగా 69వ శోభ ఫిలిం ఫేర్ అవార్డ్స్( 69th Shobha Filmfare Awards ) సౌత్ 2024 కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ వేడుక హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే.

 Here The Full List Of 69th Sobha Filmfare Awards South 2024 Winners, 69 Sobha Fi-TeluguStop.com

ఈ కార్యక్రమానికి తెలుగు తమిళ కన్నడ మలయాళ నటులు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో పలువురు హీరోయిన్లు వారి డాన్స్ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు.

ఈ ఈవెంట్ కి సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ ( Sandeep Kishan, Faria Abdullah, Vindya Visakha )వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ తదితరుల ప్రదర్శన ఆహూతులను అలరించింది.

Telugu Sobhafilmfare, Balagam, Dasara, Fulllist, Nani, Tollywood, Venu-Movie

నామినేషన్స్‌ జాబితాలో ఉన్న వారిలో విజేతలను ప్రకటిస్తున్న సమయంలో వేడుక మొత్తం విజిల్స్‌ చప్పట్లతో మార్మోగిపోయింది.మరి ఈ వేడుకలో ఏ ఏ సినిమాలు ఫిలింఫేర్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు( Director Venu ) దర్శకత్వం వహించిన బలగం సినిమా ఉత్తమ సినిమాగా నిలిచింది.

అలాగే ఉత్తమ డైరెక్టర్ గా కూడా వేణు అవార్డును అందుకున్నారు.అలాగే దసరా సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నాని( Nani ) ఉత్తమ నటురాలిగా కీర్తి సురేష్ ( Keerthy Suresh )ఎంపిక అయ్యారు.

అలాగే బేబీ సినిమా కూడా ఈ అవార్డుకు ఎంపిక అయింది.

Telugu Sobhafilmfare, Balagam, Dasara, Fulllist, Nani, Tollywood, Venu-Movie

మరి ఈ అవార్డుల ఫంక్షన్ లో ఇంకా ఏ ఏ సినిమాలు ఈ అవార్డులను సొంతం చేసుకున్నాయి అన్న విషయానికి వస్తే.బలగం సినిమాతో పాటు దసరా సినిమా కూడా ఈ అవార్డులు సొంతం చేసుకుంది.అలాగే బేబీ సినిమా, చిన్నా, వెట్రిమారన్‌ లాంటి సినిమాలు కూడా ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాయి.

అలాగే టాలీవుడ్ లో వేణు,శ్రీకాంత్ ఓదెలా,సాయి రాజేష్,వైష్ణవి చైతన్య, నవీన్ పోలిశెట్టి, ప్రకాష్ రాజ్, రవితేజ, బ్రహ్మానందం లాంటి చాలామంది సెలబ్రిటీలు ఈ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube