తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) పాల్వంచ కేటీపీఎస్ కర్మగారంలో ఉన్న పాత కూలింగ్ టవర్లను నేడు అధికారులు కూల్చివేశారు.680 మెగావాట్లు ఉత్పత్తి చేసే ఈ కర్మగారంలో ఏ, బి, సి స్టేషన్లలో ఉన్న 8 పాత కూలింగ్ టవర్ల( Cooling towers ) జీవితకాలం తగ్గిపోవడంతో వాటిని అధికారులు కూల్చివేశారు.1965 నుండి 1978 ప్రాంతంలో ఈ టవర్ల నిర్మాణం జరగదు సుమారు 50 ఏళ్ల పాటు వీటి సేవలు వినియోగం చేసుకున్నారు.
వీటి పనితనం తగ్గిపోవడంతో అధికారులు ఇప్పుడు ఈ టవర్లను అధికారులు కూల్ చేశారు.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి ఉన్న సమయంలో విద్యుత్ వెలుగుల్ని పంచడంలో కేటీపీఎస్(KTPS ) చాలా కీలకంగా వ్యవహరించింది.
ఇకపోతే ఈ టవర్లను ముంబై నగరానికి చెందిన ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ కి అప్పగించారు అధికారులు.ఇక ఈ ఘటన సమయంలో ప్లాంట్ నుండి విద్యుత్ సరఫరా చేసే లైన్లు అన్ని పూర్తిగా ఆపేశారు.ముందుగా A స్టేషన్లో ఉన్న నాలుగు టవర్లను కూల్చివేసిన తర్వాత బి, సి స్టేషన్లలో ఉన్న మిగితా నాలుగు టవర్లను కూడా నీలమట్టం చేశారు.
దీంతో పాల్వంచ పట్టణానికి తలమానికంగా కనిపిస్తున్న టవర్లు ఇకపై కనపడవు.ఈ పని కొన్ని నెలల క్రితమే చేయాలని భావించిన ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అనుమతులు పెండింగ్లో పడిపోయాయి.
ఇక కొత్త టవర్లతో పాటు గతంలో నేలమట్టం చేసిన పనులకు సంబంధించిన జెన్కో సంస్థ టెండర్లు ఆహ్వానించగా.హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ కాంట్రాక్టును రూ.485 కోట్లకు దక్కించుకుంది.పాత ప్లాంట్ లో ఉన్న మొత్తం 8 కూలింగ్ టవర్స్ ఉండగా.
ఇప్పటికీ 4 కూలింగ్ టవర్లను ఇన్ప్లోజర్ బ్లాస్టింగ్ ఆధునాతన పద్దతిలో వాటిని కూల్చివేశారు.