రాజశేఖర్ ఆ మిస్టేక్ చేయకుంటే.. చిరంజీవి కంటే పెద్ద హీరో అయ్యేవాడు..??

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్( Rajasekhar ) ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు.అంకుశం, అల్లరి ప్రియుడు, మనసున్న మారాజు, మా అన్నయ్య, సింహరాశి, గోరింటాకు వంటి హిట్ సినిమాలతో దూసుకుపోయాడు.

 Rajasekhar Big Mistake In His Career , Chiranjeevi , Rajasekhar, Balakrishna, Ve-TeluguStop.com

అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో పోటీ పడుతూ ఈ హీరో హిట్స్ అందుకునేవాడు.చిరంజీవి( Chiranjeevi ) కంటే రాజశేఖర్ పెద్ద హీరో కాబోతున్నాడని అప్పట్లో సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వ్యక్తపరిచారు.

అయితే అలాంటి సమయంలో రాజశేఖర్ ఒక బిగ్ మిస్టేక్ చేసి తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.అదేంటంటే, రాజశేఖర్ షూటింగ్స్ స్పాట్‌కు చాలా లేటుగా వచ్చేవాడు.

అంతేకాదు తన సినిమాల్లో తనకి ఇష్టమైన సన్నివేశాలు యాడ్ చేయాలంటూ దర్శకులపై ఒత్తిడి తెచ్చేవాడు.అవి బాగోవు సార్‌ అని చెప్తే వినేవాడు కాదు.

ఒక్కోసారి దర్శకులతో గొడవకి కూడా దిగేవాడు.ఈ గొడవలు పడలేక చాలామంది దర్శకులు ఆయనతో సినిమా చేయాలంటేనే భయపడి పోయేవారు.

ఈ హీరోకి బదులుగా బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో సినిమాలు చేసేవారు.ఆ విధంగా రాజశేఖర్ చాలా మంచి సినిమా అవకాశాలను ఇతర హీరోలకు వదులుకున్నాడు.

Telugu Balakrishna, Chiranjeevi, Gentlemen, Rajasekhar, Rajasekharbig, Rowdy, To

కొంతమంది దర్శకులు ఈ హీరో దగ్గరికి వచ్చి మంచి కథలు చెప్పినా వాటిని సరిగా జడ్జ్‌ చేయలేక రాజశేఖర్ పెద్ద తప్పు చేశాడు.ఆయన రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఉదాహరణకు జెంటిల్మెన్( Gentlemen ).ఈ సినిమా అర్జున్ కంటే ముందుగా రాజశేఖర్ వద్దకే వచ్చింది.కానీ దాన్ని చేయడానికి రాజశేఖర్ ఒప్పుకోలేదు.బాలయ్య బాబు ఇండస్ట్రీ హిట్ “రౌడీ ఇన్స్పెక్టర్”( Rowdy Inspector ) కథను కూడా ముందుగా రాజశేఖర్ కు వినిపించారు కానీ దాన్నీ రిజెక్ట్ చేశాడు.

Telugu Balakrishna, Chiranjeevi, Gentlemen, Rajasekhar, Rajasekharbig, Rowdy, To

రాజశేఖర్ దర్శకులతో గొడవలు పెట్టుకునే బిహేవియర్ వల్ల సగం నష్టపోయాడు.ఏ కథ హిట్ అవుతుంది అనేది జడ్జ్‌ చేయలేక కెరీర్ పూర్తిగా నాశనం చేసుకున్నాడు.ఒకవేళ ఇలాంటి బిహేవియర్ లేకపోతే ఆయన మీడియం రేంజ్ హీరో నుంచి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగి ఉండేవాడు.బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోలకు దీటుగా నిలిచేవాడు.

ఈ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.హీరోగా ఆయన చేసిన రీసెంట్ సినిమాలు నిరాశనే మిగిల్చాయి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతున్నాడు.చివరిగా 2023లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కనిపించాడు.

ఆ సంవత్సరం ఆయన ఆ ఒక్క సినిమానే చేశాడు.ఈ సంవత్సరం ఒక సినిమా కూడా చేయలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube