ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం లేదా ప్రపంచంలోని ఏ ప్రదేశమైనా లోతుగా పరిశీలిస్తే కొన్ని చీకటి కోణాలు కనిపిస్తాయి.సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన, సివిలైజ్డ్ కంట్రీస్‌లో( civilized countries ) ఒకటిగా భావించే జపాన్ కూడా మిగతా ప్రపంచ దేశాలకు భిన్నం ఏమీ కాదు.
ఇటీవల, ఒక భారతీయ ప్రయాణికుడు జపాన్‌లోని( Japan ) చీకటి కోణాన్ని కళ్లకు కట్టి చూపించే ఒక వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ ట్రావెల్ వ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
జపాన్‌లోని షిన్‌జుకు అనే నగరంలో, చాలా మంది యువకులు, యువతులు ప్రాస్టిట్యూషన్ వంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొని డబ్బు సంపాదిస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు.
ఆ ప్రాంతంలో చాలా డర్టీ హోటళ్లు ( Dirty hotels )ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పారు.గంటల వారీగా సెక్స్ ఆఫర్ చేసే హోటళ్లు కూడా అక్కడ ఉన్నాయని చెప్పారు.అలాగే, చాలామంది డ్రగ్స్ వాడుతున్నారని, రాత్రివేళ రోడ్ల మీద పడి ఉన్నట్లు కనిపిస్తున్నారని ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు.“జపాన్‌లోని డార్క్ సైడ్”( Japan’s Dark Side ) అనే క్యాప్షన్‌తో ఈ వీడియో వైరల్ అయింది.ఇది చాలా మంది ప్రేక్షకులలో పెద్ద చర్చకు దారితీసింది.
కానీ ఈ వీడియో చేయడం అవసరమా అని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోను 408,000 మంది చూశారు.15,800 మంది పంచుకున్నారు.13,500 మంది లైక్ చేశారు.చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్‌ల ద్వారా తెలియజేశారు.
ఆ వీడియోకి దాదాపు 398 మంది కామెంట్లు చేశారు.ఒక వ్యక్తి ప్రతి అభివృద్ధి చెందిన దేశానికి ఒక చీకటి కోణం ఉంటుందని కామెంట్ చేశాడు.మరొక వ్యక్తి తను కూడా జపాన్‌కి వెళ్లి వచ్చానని, అక్కడ నివసించడానికి, ప్రయాణించడానికి చాలా సురక్షితమైన దేశమని చెప్పాడు.
మరొక వ్యక్తి ఈ వీడియో చేయడం అవసరమా అని ప్రశ్నించాడు.