చిన్న వయస్సులో డిప్యూటీ కలెక్టర్.. ఐపీఎస్ సాధించిన ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

చిన్న వయస్సులోనే డిప్యూటీ కలెక్టర్ ( Deputy Collector )అనే లక్ష్యాన్ని సాధించడం అంటే సులువైన విషయం కాదు.రేయింబవళ్లు శ్రమించడంతో పాటు లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రమే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

 Bhanusri Inspirational Success Story Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

చిన్న వయస్సులోనే ఐపీఎస్ సాధించిన భానుశ్రీ( Bhanushree ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భానుశ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష కసి, పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్1 లో ( APPSC Group 1 ) ఫస్ట్ ర్యాంక్ సాధించిన భానుశ్రీ ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ ( Probationary Deputy Collector in Eluru District )గా విధులు నిర్వహిస్తున్నారు.యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షలో ఆమె సివిల్స్ లో 198వ ర్యాంక్ సాధించడం జరిగింది.

భీమవరం దగ్గర్లో ఉన్న కాళ్ల మండలానికి చెందిన ఈ యువతి తల్లీదండ్రులకు ఏకైక సంతానం కావడం గమనార్హం.తండ్రి దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు.

Telugu Appsc, Bhanushree-Inspirational Storys

పదో తరగతిలో 10కు 10 జీపీఏ సాధించిన ఈ యువతి ఇంటర్ లో ఎంఈసీ గ్రూప్ తీసుకుని ఫస్ట్ ఇయర్ లో 492 మార్కులు సాధించారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఎకనామిక్స్ చదివిన ఈ యువతి సివిల్స్ లో విజయం సాధించి ఐపీఎస్ కు కూడా ఎంపికయ్యారు.ఏపీపీఎస్సీ గ్రూప్1 లో ఫస్ట్ ర్యాంక్, యూపీఎస్సీ సివిల్స్ లో 198వ ర్యాంక్ సాధించడం సాధారణమైన విషయం కాదని చెప్పవచ్చు.

Telugu Appsc, Bhanushree-Inspirational Storys

ఈ పరీక్షల కోసం తాను ఎంతో కష్టపడి చదివానని భానుశ్రీ వెల్లడించారు.ఐపీఎస్ కు ఎంపిక కావడంతో భానుశ్రీ ఈ నెల 26వ తేదీ నుంచి ముస్సోరిలో జరిగే శిక్షణకు హాజరు కానున్నారు.భానుశ్రీ సక్సెస్ స్టోరీని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

ఆమె సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube