టాలీవుడ్ మిడిల్ రేంజ్( Tollywood middle range ) హీరోలలో ఒకరైన నాగచైతన్య( Naga Chaitanya ) జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్యకు భారీ సక్సెస్ అయితే దక్కలేదు.
బంగార్రాజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన రేంజ్ దాటలేదు.లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి నిరాశ పరిచాయనే సంగతి తెలిసిందే.
కస్టడీ సినిమా( Custody movie ) కూడా ఒకింత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా మొదట ఈ సినిమాను 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు.
అయితే ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయలను సైతం మించుతోందని తెలుస్తోంది.మరి నాగచైతన్య అంత భారాన్ని మోయగలరా అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
దూత వెబ్ సిరీస్( Dootha web series ) చైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టినా ఈ సిరీస్ ఓటీటీ వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ కమర్షియల్ సక్సెస్ గురించి కామెంట్ చేయలేము.తండేల్( Tandel ) కథను, ఆ కథలో ఉన్న ఎమోషన్స్ ను నమ్మి మేకర్స్ 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించడం ఈ సినిమాకు బిజినెస్ పరంగా ప్లస్ అవుతోంది.
చందూ మొండేటి గత సినిమా కార్తికేయ2 బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.చందూ మొండేటి కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నేపథ్యంలో భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రాబోయే రోజుల్లో ఈ దర్శకుడి కెరీర్ మరింత పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తండేల్ కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాల్సి ఉంది.