నాగచైతన్యను నమ్మి 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్.. అంత భారాన్ని మోయగలరా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్( Tollywood Middle Range ) హీరోలలో ఒకరైన నాగచైతన్య( Naga Chaitanya ) జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్యకు భారీ సక్సెస్ అయితే దక్కలేదు.బంగార్రాజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన రేంజ్ దాటలేదు.

లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి నిరాశ పరిచాయనే సంగతి తెలిసిందే.

కస్టడీ సినిమా( Custody Movie ) కూడా ఒకింత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.

నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా మొదట ఈ సినిమాను 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు.

అయితే ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయలను సైతం మించుతోందని తెలుస్తోంది.

మరి నాగచైతన్య అంత భారాన్ని మోయగలరా అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.

"""/" / దూత వెబ్ సిరీస్( Dootha Web Series ) చైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టినా ఈ సిరీస్ ఓటీటీ వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ కమర్షియల్ సక్సెస్ గురించి కామెంట్ చేయలేము.

తండేల్( Tandel ) కథను, ఆ కథలో ఉన్న ఎమోషన్స్ ను నమ్మి మేకర్స్ 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించడం ఈ సినిమాకు బిజినెస్ పరంగా ప్లస్ అవుతోంది.

"""/" / చందూ మొండేటి గత సినిమా కార్తికేయ2 బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

చందూ మొండేటి కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నేపథ్యంలో భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో ఈ దర్శకుడి కెరీర్ మరింత పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.తండేల్ కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాల్సి ఉంది.

చైనా సైనికులు చొక్కా కాలర్లకు పిన్స్ ఎందుకు పెడతారో తెలుసా..?