వీడియో: టూరిస్ట్‌లను సర్‌ప్రైజ్ చేసిన నీటి ప్రవాహం.. వాళ్లందరూ హఠాత్తుగా గల్లంతు..

ప్రస్తుతం ఉత్తరాఖండ్‌తో( Uttarakhand ) సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో నదులు, కాలువలు, జలపాతాలు అతి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

 Video Captures Deadly Monsoon Surge Tourists Swept Off By Rising Waterfall Video-TeluguStop.com

అధికారులు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు( Tourists ) హెచ్చరికలు జారీ చేసినా కూడా, కొంతమంది థ్రిల్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.చమోలి పోలీసుల అఫీషియల్ X అకౌంట్ షేర్ చేసిన ఒక వీడియో దీనికి నిదర్శనం గా నిలుస్తోంది.

ఈ వీడియోలో కొంతమంది పర్యాటకులు జలపాతం( Waterfalls ) కింద పిక్నిక్‌కి వెళ్లినట్లు చూడవచ్చు.వారు అలా ఎంజాయ్ చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద నీరు ఆ ప్రశాంతమైన దృశ్యాన్ని అల్లకల్లోలం చేసింది.

వరద నీరు చాలా మంది పర్యాటకులను బలవంతంగా లాకెళ్ళింది.

జలపాతం దగ్గర సరదాగా గడుపుతున్న ఈ పర్యాటకుల తమ ఆనందం అకస్మాత్తుగా ముగుస్తుందని అసలు ఊహించలేదు.అక్కడ నీటి మట్టం చాలా వేగంగా పెరిగింది.కొద్ది సేపట్లోనే వరద నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది.

ఈ దృశ్యం వర్షాకాలపు వరదలు( Monsoon Floods ) ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది.చమోలి పోలీసులు ఈ వీడియోను పంచుకుంటూ, వర్షాకాలంలో నదులు, కాలువలు, జలపాతాల దగ్గరకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

వీటికి ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు.అందుకే, అందరూ ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

ఇక ఉత్తరాఖండ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి, కొండ చరియలు విరిగిపడుతున్నాయి.ప్రమాదం పొంచి ఉన్న ఈ ప్రాంతాల నుంచి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube