ఇటీవల కాలంలో వధూవరులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని షాక్ ఇస్తున్నాయి.తాజాగా ఆ రెండో కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో, ఒక పెళ్లి కూతురు( Bride ) తన అత్తగారింట్లో సిగరెట్ తాగుతూ కనిపించింది.ఆమె వెడ్డింగ్ డ్రెస్‌లోనే కనిపించింది.
చక్కగా చీర కట్టుకొని ట్రెడిషనల్ గా ఉంది కానీ ఏదో ఆకు రౌడీ లాగా ఆమె సిగరెట్ తాగుతూ రెచ్చిపోయింది.అకస్మాత్తుగా ఆమె భర్త ఆ గదిలోకి వచ్చేసరికి, ఆమె వెంటనే సిగరెట్‌ను విసిరివేసింది.
భయంతో తలుపు తెరిచింది.అంతటితో వీడియో ముగుస్తుంది.
సీమా మీనా అనే సోషల్ మీడియా( Social media ) స్టార్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.ఆమెకు సుమారు 59.8 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఇలాంటి వీడియోలు చేసి పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు.ఆమె పోస్ట్ చేసిన రీసెంట్ వీడియోకు కేవలం కొద్ది రోజుల్లోనే 39 లక్షల వ్యూస్ వచ్చాయి.1,48,000 మంది ఈ వీడియోను షేర్ చేశారు.1,09,000 మంది లైక్ చేశారు.1,948 మంది కామెంట్స్ చేశారు.
ఆ వీడియోకి కింద కామెంట్లలో రెండు రకాల అభిప్రాయాలు వచ్చాయి.చాలామంది ఆ పెళ్లి కూతుర్ని తిట్టారు.ఒక అమ్మాయి ఎలా సిగరెట్ తాగుతుంది అని ప్రశ్నించారు.ముఖ్యంగా అత్తగారింట్లో అలా చేయడం తప్పు అని అన్నారు.మన దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు సిగరెట్ తాగితే చాలా మందికి ఇష్టం ఉండదు.అలా చేయడం తప్పు అని చాలామంది అనుకుంటారు.
కానీ, కొంతమంది మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు.ప్రతి ఒక్కరికీ తమ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి తగిన స్వేచ్ఛ ఉండాలని వాళ్ళు అన్నారు.
అమ్మాయిలు కూడా అబ్బాయిలలాగే స్వేచ్ఛగా ఉండాలని, పాత కాలపు ఆలోచనలు మార్చాలని వాళ్లు కామెంట్ చేశారు.ఈ వీడియో బాగా వైరల్ అయింది కాబట్టి ఆమె అత్త భర్త దృష్టికి కూడా రావచ్చు.
దాన్ని చూసి కుటుంబ పరువు తీసేసావ్ అంటూ వాళ్ళు ఈమెను తిట్టొచ్చు కొట్టొచ్చు.