మామూలుగా అభిమానులు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.కొన్ని కొన్ని వాటంతట అవి తెలియగా మరికొన్ని సార్లు సెలబ్రిటీలు చెప్పేవరకు ఆ విషయాలు బయటకు రావు.
సెలబ్రిటీలు కూడా తగిన సందర్భాలు కోసం ఎదురు చూసి మరీ కొన్ని కొన్ని విషయాలను స్వయంగా వారే ప్రకటిస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళి( Rajamouli ) మీద రూపొందించిన మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ సిరీస్ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
గంటన్నర పాటు ఆయన ప్రయాణం, కెరీర్ లో చూసిన ఎత్తుపల్లాలు, పని చేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేయడంతో అందరు హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్( Ram Charan ) ఏం చెప్పి ఉంటారా అని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.అందులో భాగంగానే డాక్యుమెంటరీపై స్పందించిన హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.మగధీర సినిమా( Magadheera )కు ముందు చెర్రీ తండ్రి చిరంజీవి సింహాద్రి సినిమా( Simhadri)ను చూశారట.
ఆ సినిమాను చూసిన తర్వాత ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో జక్కన్న దర్శకత్వం చూసి చిరంజీవి ఆశ్చర్యపోయారని, ఆయన నోట మాట రాలేదని, అంతటి మెగాస్టార్ ని కేవలం రెండో సినిమాతోనే మెప్పించిన దర్శక ధీరుడు రాజమౌళి అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
కాగా కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే సింహాద్రి టైంలో చిరుకి గట్టి పోటీ ఇచ్చేవాడు వచ్చాడంటూ అప్పటి కొన్ని మీడియా సాధనాల్లో తారక్ పై కథనాలు వచ్చేవి.దానికి తగ్గట్టే సింహాద్రి ఆ టైంలో నెలకొల్పిన రికార్డులు మామూలువి కాదనే చెప్పాలి.అయితే ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో రాజమౌళి ఎంత పెద్ద స్థాయికి చేరినప్పటికీ ఆయనకు బలమైన పునాది వేసింది మాత్రం ఖచ్చితంగా సింహాద్రి సినిమా అనే చెప్పాలి.
బాషా, సమరసింహారెడ్డి, ఇంద్ర తర్వాత హీరో తాలూకు ఫ్లాష్ బ్యాక్ ని వాటికన్నా శక్తివంతంగా పక్క రాష్ట్రంకి తీసుకెళ్లి మరీ మేజిక్ చేసిన జక్కన్న ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు.