వీడియో: టూరిస్ట్‌లను సర్‌ప్రైజ్ చేసిన నీటి ప్రవాహం.. వాళ్లందరూ హఠాత్తుగా గల్లంతు..
TeluguStop.com
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌తో( Uttarakhand ) సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో నదులు, కాలువలు, జలపాతాలు అతి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.అధికారులు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు( Tourists ) హెచ్చరికలు జారీ చేసినా కూడా, కొంతమంది థ్రిల్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
చమోలి పోలీసుల అఫీషియల్ X అకౌంట్ షేర్ చేసిన ఒక వీడియో దీనికి నిదర్శనం గా నిలుస్తోంది.
ఈ వీడియోలో కొంతమంది పర్యాటకులు జలపాతం( Waterfalls ) కింద పిక్నిక్‌కి వెళ్లినట్లు చూడవచ్చు.
వారు అలా ఎంజాయ్ చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద నీరు ఆ ప్రశాంతమైన దృశ్యాన్ని అల్లకల్లోలం చేసింది.
వరద నీరు చాలా మంది పర్యాటకులను బలవంతంగా లాకెళ్ళింది. """/" /
జలపాతం దగ్గర సరదాగా గడుపుతున్న ఈ పర్యాటకుల తమ ఆనందం అకస్మాత్తుగా ముగుస్తుందని అసలు ఊహించలేదు.
అక్కడ నీటి మట్టం చాలా వేగంగా పెరిగింది.కొద్ది సేపట్లోనే వరద నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది.
ఈ దృశ్యం వర్షాకాలపు వరదలు( Monsoon Floods ) ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది.
చమోలి పోలీసులు ఈ వీడియోను పంచుకుంటూ, వర్షాకాలంలో నదులు, కాలువలు, జలపాతాల దగ్గరకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
వీటికి ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు.
అందుకే, అందరూ ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. """/" /
ఇక ఉత్తరాఖండ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి, కొండ చరియలు విరిగిపడుతున్నాయి.ప్రమాదం పొంచి ఉన్న ఈ ప్రాంతాల నుంచి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లడం మంచిది.
లేడీ కంటెస్టెంట్లను వాటేసుకుంటున్న మణికంఠ.. ఇంత జరుగుతున్నా సీపీఐ నారాయణ గప్‌చుప్..?