వయనాడ్ విషాదం.. భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సెలబ్రిటీల జాబితా ఇదే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కేరళ ఎక్కువగా వినిపిస్తోంది.తాజాగా కేరళ లోని వయనాడ్ ( Wayanad in Kerala )లో జరిగిన విషాదం గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.

 Nayanthara And Vignesh Shivan Contribution To The Kerala Chief Ministers Relief-TeluguStop.com

ఆకస్మిక వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి భారీగా మట్టి బురద రావడంతో వందలాది కుటుంబాలు మరణించడంతోపాటు ఇప్పటికే అక్కడ మరణించిన వారి సంఖ్య 300 దాటింది.అయితే గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.

ఇక ఇప్పటికే ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ( Prime Minister Modi ) నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది స్పందించిన విషయం తెలిసిందే.

Telugu Donate, Nayanatara, Vignesh Shivan, Wayand-Movie

కొందరు సెలబ్రిటీలు అలాగే పలువురు రాజకీయ నాయకులు మృతుల కుటుంబాలకు సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.ఇప్పటికే చాలామంది సినిమా సెలబ్రిటీలు విరాళాలు అందించిన విషయం తెలిసిందే.మరి ఏ ఏ సెలబ్రిటీలు ఎంత విరాళాలు అందించారు అన్న వివరాల్లోకి వెళితే.

కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ( Kollywood Star Celebrities )అయినా నయనతార భర్త విగ్నేష్ లు తాజాగా గొప్ప మనసును చాటుకున్నారు.వయనాడ్‌ లో జరిగిన ప్రకృతి విపత్తు పై స్పందించిన వారు దాదాపు 20 లక్షల విరాళాలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Telugu Donate, Nayanatara, Vignesh Shivan, Wayand-Movie

అలాగే లక్కీ భాస్కర్‌ టీమ్‌ రూ.5 లక్షల విరాళం ప్రకటించింది.అలాగే తమిళ హీరో సూర్య( Tamil hero Surya ) ఆయన భార్య జ్యోతిక సోదరుడు కార్తీ ముగ్గురు కలిసి దాదాపు 50 లక్షలు ప్రకటించారు.

అలాగే మలయాళ నటులు మమ్ముట్టి( Actors Mammootty ) ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) 35 లక్షలు ప్రకటించారు.ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.ఈ ఘటనపై మలయాళ చిత్ర పరిశ్రమ కూడా విచారం వ్యక్తం చేసింది.

కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు వెల్లడించాయి.కమల్‌ హాసన్‌లాంటి మరికొందరు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా వయనాడ్‌ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

వీరితోపాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు వారికి తోచిన విధంగా విరాళాలను ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube