కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) తెలంగాణలో బలం పెంచుకునేందుకు ఎప్పటి నుంచో , ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.హోరా హోరీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను బిజెపి గెలుచుకుంది.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల కంటే ఎక్కువ స్థానాలను తెచ్చుకుని అధికారం చేపడతామనే ధీమా ను ముందు నుంచి వ్యక్తం చేసినా, ఎన్నికల ఫలితాలు బిజెపికి షాక్ ఇచ్చాయి.గెలిచిన ఎమ్మెల్యేలు తమ వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్నారా అంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
అసెంబ్లీ లోనూ బిజెపి వాయిస్ పెద్దగా వినిపించడం లేదు.దీనికి కారణం పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు తగిన సహకారం, సూచనలు అందకపోవడమే కారణమట.
తెలంగాణలో బిజెపి నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు ఎమ్మెల్యేలు కొత్తగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన వారే. మిగతా ఇద్దరిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి , రాజాసింగ్ సీనియర్లు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ ఏ అంశాలపై మాట్లాడాలి ? అధికార పార్టీ ని ఏ విధంగా నిలదీయాలనే విషయంలో సరైన గైడెన్స్ లభించకపోవడంతో బిజెపి ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారట .ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ బిజెపి పరిస్థితి ఇతర పార్టీలకు భిన్నంగా మారింది .అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇతర పార్టీ లకు చెందిన ఎమ్మెల్యేలకు పలు అంశాలపై వారికి అవగాహన కల్పించడం, ఏ ఏ అంశాలపై మాట్లాడాలనే విషయంపై తగిన సూచనలు చేయడం వంటివి ఉంటాయి. కానీ తెలంగాణ బిజెపి లో ఆ పరిస్థితి లేకపోవడంతో, బిజెపి ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారట.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ నాయకత్వం సబ్జెక్టు ను అందిస్తుండగా, బిజెపిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదట.
ఇదే కాకుండా పార్టీ కార్యక్రమాల్లోనూ తమకు అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంతృప్తి ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది.
ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదట. అలాగే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్ లోను బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోటోలు తప్ప మిగతా వారి ఫోటోలు ముద్రించకపోవడం వంటి ఘటనలతో పాటు, బీజేఎల్పిని రాష్ట్ర నాయకత్వం సరిగా పట్టించుకోవడంలేదనే అసంతృప్తి ఆ పార్టీ ఎమ్మెల్యేలలో కనిపిస్తోందట.