జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో హైపర్ ఆది ( Hyper Aadi ) ఒకరు.ప్రస్తుతం ఈయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటున్న హైపర్ ఆది గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈయన గత ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు మద్దతు తెలియజేయడంతో ఈయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇక హైపర్ ఆది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తను ఎలాంటి రాజకీయ పదవులు ఆశించి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపలేదని వెల్లడించారు.పవన్ కళ్యాణ్ కు నేను పెద్ద అభిమాని ఆభిమానం కారణంగానే మద్దతు తెలిపానని వెల్లడించారు.అయితే గత ఎన్నికలలో రోజా( Roja )గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన హైపర్ ఆది తాజాగా రోజా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇదే ఇంటర్వ్యూలో భాగంగా రోజాపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ రోజా గారికి ఆయన (జగన్) అంటే ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.ఇలా ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి కానీ జబర్దస్త్ జడ్జిగా ( Jabardasth Judge ) రోజా గారు అంటే నాకు చాలా గౌరవం అని తెలిపారు.ఆమె కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు.
తనలాగే చాలా మంది ఆర్టిస్ట్ లకు ఇంతటి పేరు వచ్చిందంటే కారణం ఆమెనే.ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుందని హైపర్ ఆది ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.