పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా(Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.కొరటాల శివ( Koratala Shiva) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతున్నాయి ఇకపోతే ఇటీవల సెకండ్ సింగిల్ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఆగస్టు 5వ తేదీ ఈ సెకండ్ సింగిల్ విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించడమే కాకుండా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇలా ఈ పోస్టర్లు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ( Janhvi kapoor ) ఒక డాన్స్ స్టిల్ లో కనిపిస్తూ కనిపించారు అయితే ఈ పోస్టర్ పై భారీ స్థాయిలో విమర్శలు రావడం గమనార్హం.అయితే ఈ పాట ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా తెలియకుండానే కేవలం పోస్టర్ చూసి ఇలా ట్రోల్ చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.హీరోహీరోయిన్ డాన్స్ భంగిమ అంతగా సూట్ కాలేదని కొందరు మూవీ లవర్స్ అంటున్నారు.ముఖ్యంగా గత సినిమాల్లో కూడా ఇలాంటి ఫోజులతో పోస్టర్లు వచ్చాయి.వాటితో పోలిస్తే ఈ పోస్టర్ పెద్దగా బాగాలేదని కామెంట్లో చేస్తున్నారు.
ఇక ఈ పోస్టర్ పై రామ్ చరణ్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు.ఇలాంటి ఫోజు తమ హీరో మగధీర సినిమాలో కూడా ఉందని ఆ సినిమా పోస్టర్ తో పోలిస్తే దేవర పోస్టర్ పెద్దగా బాలేదంటూ కామెంట్లో చేస్తున్నారు.అలాగే ప్రభాస్ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ సినిమాలో కూడా అచ్చం ఇలాంటి పోస్టర్ ఉండడంతో ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాల నుంచి కాపీ కొట్టారు అంటూ పలువురు ఈయనపై విమర్శలు చేస్తున్నారు.
మరి ఈ రొమాంటిక్ సాంగ్ కొరటాల ఏ విధంగా డిజైన్ చేశారు అనేది పూర్తి పాట విడుదలయితేనే తెలుస్తుంది.