టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో అన్ని సినిమాలు కాకపోయినా మెజారిటీ పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.బాహుబలి1, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధ్యం కావడం లేదు.
తమిళనాడు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే తక్కువ సంఖ్యలో థియేటర్లు ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పవచ్చు.2.0, విక్రమ్, జైలర్ ( 2.0, Vikram, Jailer )సినిమాలు సక్సెస్ సాధించినా ఆ సినిమాలు ఒక మార్క్ దాటి కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.ఇండియన్2 సినిమా( Indian2 movie ) అయినా ఆ ఘనతను సొంతం చేసుకుంటుందని భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
కోలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు ఈ ఏడాది సెకండాఫ్ కలిసొస్తుందేమో చూడాలి. స్టార్ హీరో సూర్య( Star hero Surya ) కంగువ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కంగువ సినిమా ( Kanguva movie )రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
సూర్య బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.సిరుత్తై శివ డైరెక్షన్ ( Siruttai Shiva )లో ఈ సినిమా తెరకెక్కుతోంది.సిరుత్తై శివ ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.కంగువ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.సూర్య రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందని భోగట్టా.