మొదటి వన్డే టై తర్వాత సూపర్ ఓవర్ ఎందుకు జరగలేదు.? ఐసీసీ రూల్స్ ఎలాఉన్నాయంటే.?

మూడు వన్డేల సిరీస్‌లో( ODI series ) భాగంగా శుక్రవారం భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జరిగింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అనంతరం 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.కానీ మ్యాచ్ టైగా ముగిసింది.కాకపోతే ఫలితం కోసం సూపర్ ఓవర్ లేదు.క్రికెట్‌లో రెండు జట్ల స్కోరు సమానంగా అయినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరుగుతుందని అందరూ భావించారు.

 After The First Odi Tie, Why Was The Super Over Not Held What Are The Icc Rules,-TeluguStop.com

అయితే ఫలితం లేకుండానే మ్యాచ్‌ ముగిసింది.

Telugu Odi Tie, Icc, India, Tied, Odi, Srilanka-Latest News - Telugu

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( International Cricket Council ) (ICC) నిబంధనల ప్రకారం, ద్వైపాక్షిక సిరీస్‌లో వన్డే మ్యాచ్ డ్రా అయినట్లయితే, ఫలితాన్ని నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహించబడదు.ఐసీసీ టోర్నీలను వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తే మాత్రం ఫలితం సూపర్‌ ఓవర్‌ అవుతుంది.అందుకే భారత్-శ్రీలంక( India-Sri Lanka ) మధ్య తొలి వన్డేలో సూపర్ ఓవర్ లేదు.

అయితే ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ నిబంధన టీ20 సిరీస్‌లకు( T20 series ) వర్తించదు.ఇక టీ20 ఫార్మాట్‌లో ఏదైనా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం నిర్ణయించబడుతుంది.

Telugu Odi Tie, Icc, India, Tied, Odi, Srilanka-Latest News - Telugu

ఇక మ్యాచ్ లో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మంచి శుభారంభం లభించింది.ఓపెనర్లు తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు.గిల్ (16 పరుగులు) నిరాశపరిచినా, రోహిత్ అద్భుత అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసి 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు.అనంతరం విరాట్ (24 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (23 పరుగులు) విఫలమయ్యారు.

దీంతో భారత్ 132 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.కేఎల్ రాహుల్ (31 పరుగులు), అక్షర్ పటేల్ (33 పరుగులు), శివమ్ దూబే (25 పరుగులు) ఈసారి పోరాడారు.

అయితే చివరికి భారత్ విజయానికి 18 బంతుల్లో 5 పరుగులు మాత్రమే కావాలి.చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి.అంతేకాదు క్రీజులో దూబే నిలిస్తే విజయం ఖాయమని అందరూ భావించారు.48వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో పరుగులేమి చేయని దూబే మూడో బంతికి ఫోర్ కొట్టాడు.దాంతో స్కోరు సమమైంది.కానీ నాలుగో బంతికి దూబే ఎల్బీడబ్ల్యూ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు.ఆ తర్వాతి బంతికే అర్ష్‌దీప్ కూడా అవుటయ్యాడు.దాంతో మ్యాచ్ టైగా ముగిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube