ద్రాక్షలో పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను కలిగిస్తుంది.ప్రతి రోజు గుప్పెడు ఎండు ద్రాక్షను తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాటి గురించి తెలిస్తే మీరు కూడా ప్రతి రోజు ఎండు ద్రాక్షను తప్పకుండా తినటం ప్రారంభిస్తారు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కిస్‌మిస్ పండ్లు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి.నీటిలో 10 కిస్ మిస్ లను వేసి ఉడకబెట్టి గుజ్జులా చేసి త్రాగితే నరాలు బలంగా ఉంటాయి.
పిల్లలు రాత్రి పూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతి రోజూ రాత్రి పూట కొన్ని కిస్‌మిస్ పండ్లను ఇస్తూ ఉంటే క్రమంగా పక్క తడిపే అలవాటు పోతుంది.
గొంతు సమస్యతో బాధపడేవారు కిస్ మిస్ తింటే మంచి ఉపశమనం కలుగుతుంది.
గొంతులో కఫాన్ని తగ్గించే లక్షణం కిస్ మిస్ లో ఉంది.
ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు ఎండుద్రాక్షతో సోంపు కలిపి తీసుకుంటే మలబద్దక సమస్య తొలగిపోతుంది.
ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీటిని చిన్న పిల్లలకు త్రాగితే జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
ఎండు ద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉండుట వలన రక్తహీనతతో బాధపడేవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.ఇవి వైరస్, బాక్టీరియాలతో పోరాడతాయి.చర్మ వ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్ల వంటి వాటిని రాకుండా చూస్తాయి.