ఇంగ్లీష్ కామిక్ యాక్టర్, ఫిలిం మేకర్ అయిన చార్లీ చాప్లిన్( Charlie Chaplin ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.మూకి చిత్రాల సమయంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గొప్ప హాస్యనటుడితడు.
సినిమాల్లో, టీవీ ప్రోగ్రామ్స్ లో చార్లీ చాప్లిన్ చాలా కామెడీగా కనిపిస్తాడు.కానీ రియల్ లైఫ్ లో మాత్రం అతడు వేరే పర్సన్‌లా కనిపిస్తాడు.
అందుకే నిజ జీవితంలో అతడిని చాలామంది గుర్తుపట్టలేకపోతుంటారు.ఆయన క్యారెక్టర్‌లోకి దూరిపోతే మళ్లీ నిజ జీవితంలో ఆయన ఎలా ఉంటాడో అలా అస్సలు ఉండడు.
అందుకే అతను గొప్ప నటుడు అని అంటారు.
ఆన్‌స్క్రీన్‌పై చార్లీ చాప్లిన్ హిట్లర్‌లాంటి వేషంలో కనిపిస్తుంటాడు.కచ్చితంగా చెప్పాలంటే తలపై టోపీ, చేతిలో కర్ర, చిన్న మీసం, నల్ల సూటుతో ఒక ప్రత్యేకమైన వేషధారణలో చాప్లిన్ కనిపించేవాడు.ఆ వేషధారణలో చేసిన చిత్రాలు అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా అతడి క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది.ఈ నటుడి ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, కొంటె చేష్టలు బాగా నవ్వించేవి.
ఒక్క మాట కూడా లేకుండా, జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే చాప్లిన్ సినిమాలు( Charlie Chaplin Movies ) థియేటర్లలోకి వస్తూ సూపర్ సక్సెస్ అయ్యేవి.ఈ సినిమాల మధ్యలో అక్కడక్కడా సబ్ టైటిల్స్ యాడ్ చేసి స్టోరీ ఏంటనేది అందరికీ పూర్తిగా అర్థమయ్యేలా చేసేవారు.
అయితే అప్పట్లో ఒక థియేటర్ యజమాని ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు.ఆయనకు బెల్లింగ్‌హామ్ అనే ఊరిలో లిబర్టీ థియేటర్( Liberty Theater ) ఉంది.ఇందులో 1921లో ‘ది ఐడిల్ క్లాస్’( The Idle Class ) అనే ఒక మూవీ విడుదలైంది.ఆ సినిమా కంటే ముందు లిబర్టీ థియేటర్‌లో ‘ది ట్రాంప్’ ( The Tramp ) సినిమా రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ నటించాడు.ఈ మూవీలో చార్లీ చాప్లిన్ ఎలాంటి వేషంలో కనిపించాడో అలాంటి వేషంలో వచ్చిన వారు ‘ది ఐడిల్ క్లాస్’ సినిమాని ఫ్రీగా చూడొచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
చార్లీ చాప్లిన్ కి బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఆయన పేరుని వాడుకుంటూ తన థియేటర్ని ప్రమోట్ చేయాలనుకున్నాడు.
అనుకున్న విధంగానే థియేటర్ యజమాని ప్రకటనకు విపరీతమైన స్పందన వచ్చింది.చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గెటప్ వేసుకొని థియేటర్‌కి పోటెత్తారు.అంతమంది చాప్లిన్ గెటప్స్ లో రావడం చూసి మిగతా జనం అంతా ఆశ్చర్యపోయారు.
సినిమా అయిపోయాక చాప్లిన్ వేషం వేసుకున్న వారందరినీ ఒక గ్రూప్ ఫోటో తీసి పత్రికల్లో కూడా ప్రచురించారు.వీరిలో ఎవరైతే చార్లీ చాప్లిన్ కి చాలా దగ్గరగా ఉన్నారో వారిని విజేతలుగా ప్రకటించి బహుమతులు ఇవ్వాలని యజమాని అనుకున్నాడు.
అందరినీ పరిశీలించి ఒక వ్యక్తికి విజేతగా ప్రకటించారు.ఆయన అచ్చం చార్లీ చాప్లిన్ లాగానే ఉన్నారని కూడా ప్రశంసించారు.ఇలా ఒకటి, రెండు, మూడు అనుకుంటూ విజేతలుగా ప్రకటించి చివరికి 20వ స్థానాన్ని అసలైన చార్లీ చాప్లిన్ కి ఇచ్చారు.అసలైన తనను గుర్తించకుండా వేరే వారిని చార్లీ చాప్లిన్ అనుకోవడం కల్లారా చూస్తూ చాప్లిన్ ఆశ్చర్యపోయాడు.
కొద్ది రోజులకి ఈ థియేటర్‌కు తాను కూడా వచ్చానని చార్లీ చాప్లిన్ చెప్పాడు.అది తెలిసిన చాలామంది నోరెళ్లపెట్టారు.