జులై నెలలో పుట్టినవారు పక్కవారికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు.వీరు అందరికి మేలు చేయాలని అనుకుంటారు.
వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.వీరు చాలా అదృష్టవంతులు.
వీరు చాలా చురుకుగా ఉండి ఎవరికీ తొందరగా అర్ధం కారు.వీరు ఏదైనా పనిలో ఉంటే ఆ పని అయ్యేవరకు వేటిని పట్టించుకోరు.
చేస్తున్న పనిని అనుకున్న సమయంలోనే చేస్తారు.
వీరు నమ్మిన పనిని నిజాయితీతో పూర్తి చేసే లక్ష్యంతో ఉంటారు.
ఏదైనా పని అప్పజెప్పితే నిజాయితీగా పూర్తి చేస్తారు.ఎవరితోనూ మాట పడటానికి ఇష్టపడరు.
వీరు పూర్తి స్థాయిలో తెలివిని ఉపయోగిస్తే చాలా తేలికగా విజయం సొంతం అవుతుంది.వీరు సంపాదనలో కూడా చాలా ముందు ఉంటారు.
క్రొత్త రకమైన వస్తూవులను కనిపెట్టుట ద్వారా, వారి తెలివితేటలతోనూ, మంచి మేధస్సుతోనూ క్రొత్త రకమైన వ్యాపారాలను ప్రారంభించి మంచి లాభాలు సంపాదిస్తారు.
పది మందితోనూ స్నేహంగా ఉండటమే కాకుండా, బయట అందరిలోనూ బాగా చురుకుగా ఉండి అందరిలోనూ గౌరవ మర్యాదలు అందుకుంటూ స్నేహభావముతో అందరినీ ఆకట్టుకుంటారు.వీరు శ్రమకు ఓర్చి మరీ కష్ట పడతారు.ఈ నెలలో పుట్టిన వారు జీవితములో ఎన్నో రకాలైన సవాళ్ళను ఎదుర్కుంటారు.
వీరు కష్టనష్టములను ఓర్చుకుని కష్ట పడి పైకి వస్తారు.
ఆరోగ్యము : వీరికి ఎక్కువగా మల బద్దకము, గ్యాస్ ట్రబుల్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ధనము : వీరు మొదటి నుంచి కష్టాన్ని నమ్ముకున్న వారు వ్యాపార రీత్యా వీరికి మంచి ఆదాయము లభిస్తుంది.
లక్కీ వారములు : ఆదివారము, బుధ వారము.
లక్కీ కలర్ : ఆకుపచ్చ మరియు పసుపు రంగు.
లక్కీ స్టోన్ : మూన్ స్టోన్, ముత్యము మరియు డైమండ్.